నెల రోజుల పాటు సూర్య అనుగ్రహంతో ఈ రాశులకు పండగే.. డబ్బు, ఉద్యోగాలు, అదృష్టం ఇలా ఎన్నో!
జ్యోతిష్య ప్రకారం 2026 సెప్టెంబర్ 17న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించాడు. అక్టోబర్ 17 వరకు సూర్యుడు కన్యలో సంచరిస్తాడు. సూర్యుడు, బుధుడు ఒకే రాశిలో కలవడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడగా, సెప్టెంబర్ 26న బుధుడు తులారాశిలోకి వెళ్లడంతో ఈ యోగం ముగుస్తుంది.
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సెప్టెంబర్ నెల గ్రహాల మార్పుల పరంగా చాలా ప్రత్యేకమైనదిగా నిలుస్తోంది. తాజాగా నవగ్రహాల అధిపతి అయిన సూర్యభగవానుడు తన రాశిని మార్చారు. సెప్టెంబర్ 17, 2026న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించారు. దాదాపు నెల రోజుల పాటు ఆయన ఇదే రాశిలో సంచరిస్తారు. ఈ కాలంలో సూర్యుడు, బుధ గ్రహాల కలయిక జరగడం వల్ల శక్తివంతమైన 'బుధాదిత్య రాజయోగం' ఏర్పడింది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక రంగాలపై ఈ యోగం తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో ఏయే రాశుల వారికి అదృష్టం కలిసిరానుందో పరిశీలిద్దాం.

సూర్య గోచర కాలం ప్రత్యేకతలు
సూర్యుడు సాధారణంగా ప్రతి నెల తన రాశిని మారుస్తుంటాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 17న కన్యారాశిలోకి అడుగుపెట్టిన సూర్యుడు అక్టోబర్ 17 వరకు అక్కడే ఉంటాడు. అయితే, ఈ =కాలంలో ఏర్పడే బుధాదిత్య యోగం మాత్రం సెప్టెంబర్ 26 వరకు మాత్రమే ఉంటుంది. ఆ రోజు బుధుడు తులా రాశిలోకి ప్రవేశించడంతో ఈ యోగ కాలం ముగుస్తుంది. అయినప్పటికీ, సూర్య సంచారం వల్ల కొన్ని రాశుల వారికి ఈ నెల రోజులు అత్యంత అనుకూలంగా ఉండబోతున్నాయి.
మేష రాశి
ఉద్యోగ, వ్యాపారాలు చేసేవారికి ఈ కాలం ఎంతో కీలకం. ఆఫీస్‌లో కొత్త బాధ్యతలు మీ భుజాన పడే అవకాశం ఉంది. కెరీర్ మార్పు గురించి ఆలోచించే వారికి ఇది సరైన సమయం. వ్యాపారస్తులు కొత్త వ్యక్తుల పరిచయం ద్వారా లబ్ధి పొందుతారు. నిలిచిపోయిన పనులు మళ్లీ వేగంగా పూర్తవుతాయి. అయితే, ఏ పనిలోనైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. పైఅధికారులతో మాట్లాడేటప్పుడు మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరచండి.
కర్కాటక రాశి
విద్యార్థులకు, ఉద్యోగులకు ఈ సూర్య గోచరం శుభఫలితాలను ఇస్తుంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువత మరింత ఏకాగ్రతతో శ్రమిస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. ఉద్యోగంలో మారాలని ప్రయత్నిస్తున్న వారికి కొత్త అవకాశాలు తలుపు తడతాయి. కుటుంబ సభ్యుల పూర్తి సహకారంతో ఏవైనా ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా ఆచితూచి ఖర్చు చేయడం, బడ్జెట్ ప్రకారం నడుచుకోవడం చాలా ముఖ్యం.
తులా రాశి
తులా రాశి వారికి కెరీర్ పరంగా ఈ సమయం అద్భుతంగా ఉంది. మీరు పడిన కష్టానికి తగిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. వ్యాపార విస్తరణకు నూతన పరిచయాలు తోడ్పడతాయి. గతంలో వాయిదా పడిన పనులను ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అయితే, ఎక్కడైనా పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
వృశ్చిక రాశి
ఆర్థిక లావాదేవీల పరంగా వృశ్చిక రాశి వారికి ఈ గోచరం ఊహించని మార్పులను తెస్తుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు లేదా బాధ్యతలలో మార్పులు ఉండే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు ఆర్జించడానికి చక్కటి అవకాశాలు ఎదురవుతాయి. కుటుంబంలో ఎవరివల్లనైనా శుభవార్తలు వింటారు. ఏదేమైనప్పటికీ, భారీ ఖర్చులపై నియంత్రణ కలిగి ఉండటం మీ భవిష్యత్తుకు ఎంతో అవసరం.
జ్యోతిష్య శాస్త్రంలో సూర్య గోచర ప్రాముఖ్యత
వైదిక జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడిని ఆత్మకారకుడు, పితృకారకుడు, ప్రభుత్వ పనులు, కీర్తి ప్రతిష్టలు, నాయకత్వ లక్షణాలకు ప్రతీకగా భావిస్తారు. కన్యారాశికి బుధుడు అధిపతి. అలాంటి బుధ స్థానంలో సూర్యుడు సంచరించడం, ఆపై బుధుడితో కలవడం వల్ల బుధాదిత్య యోగం సిద్ధిస్తుంది. ఈ యోగం మనిషిలో తెలివితేటలు, సంభాషణా చాతుర్యం, సరైన నిర్ణయాలు తీసుకోగల శక్తిని పెంపొందిస్తుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


