తులా రాశిలో శుక్ర సంచారం - ఈ రాశుల వారికి అదృష్టం, సిరిసంపదలు!
గ్రహాల అధిపతి అయిన శుక్రుడు తన సొంత రాశి అయిన తులారాశిలోకి ప్రవేశించాడు. నవంబర్ 6 వరకు కొనసాగే ఈ 65 రోజుల అరుదైన సంచారం ఏయే రాశుల జాతకాన్ని మారుస్తుందో తెలుసుకోండి.
జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభ గ్రహంగా, భౌతిక సుఖ సంతోషాలకు, సంపదకు, ప్రేమ, కళలకు కారకుడైన శుక్ర గ్రహం తన సొంత రాశి అయిన తులారాశిలోకి ప్రవేశించింది. 2026 సెప్టెంబర్ 2న ప్రారంభమైన ఈ శుక్ర సంచారం నవంబర్ 6 వరకు.. అంటే దాదాపు 65 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగనుంది. ఒక శుభ గ్రహం తన స్వక్షేత్రంలో ఇన్ని రోజులు సంచరించడం జ్యోతిష్య రీత్యా అత్యంత ప్రాధాన్యత కలిగిన ఘట్టంగా ప్రముఖ జ్యోతిష్య నిపుణులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ అభివర్ణించారు. శుక్రుడి బలమైన స్థానం వల్ల పలు రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక లబ్ధి మరియు వ్యక్తిగత సంబంధాలలో అద్భుతమైన పురోగతి లభించనుంది.

మేష రాశి:
ఈ రాశి వారికి తులారాశిలో శుక్రుడి సంచారం సంతోషకరమైన మార్పులను తెస్తుంది. ఉద్యోగ యత్నాల్లో ఉన్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త భాగస్వామ్యాలు, పరిచయాల ద్వారా మంచి లాభాలను గడిస్తారు. దంపతులు, భాగస్వాముల మధ్య సంబంధాలు మరింత బలపడతాయి.
మిథున రాశి:
సృజనాత్మక రంగాల్లో ఉన్న మిథున రాశి వారికి ఇది స్వర్ణయుగమనే చెప్పాలి. కార్యాలయాల్లో మీ నైపుణ్యానికి తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. కొత్త వ్యక్తులతో జరిగే వ్యాపార ఒప్పందాలు భవిష్యత్తులో లాభదాయకంగా మారతాయి.
కర్కాటక రాశి:
ఈ రాశి వారికి కుటుంబంలో ఆనందం, ఆర్థిక స్థిరత్వం లభిస్తాయి. నూతన ఆదాయ మార్గాలు సుగమమవుతాయి. ఇల్లు, వాహనం లేదా భౌతిక సౌకర్యాల కోసం కొంత ఖర్చు చేసినప్పటికీ, ఆదాయంలో వృద్ధి ఉండటం వల్ల ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు.
కన్యా రాశి:
ఆర్థిక విషయాలలో కన్యా రాశి వారికి శుక్రుడు భూరి లాభాలను తెచ్చిపెడతాడు. రాబడి గణనీయంగా పెరుగుతుంది. వ్యాపారంలో దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయి. అయితే ఆర్థిక లాభాలు ఉన్నప్పటికీ, అనవసర ఖర్చులను నియంత్రించుకోవడానికి సరైన బడ్జెట్ పాటించడం శ్రేయస్కరం.
తులారాశి:
శుక్రుడు తన సొంత రాశి అయిన తులారాశిలోనే సంచరిస్తున్నందున…. ఈ రాశి వారికి రాజయోగం లాంటి ఫలితాలు కనిపిస్తాయి. వీరిలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. సమాజంలో, వర్కింగ్ స్పేస్‌లో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, వ్యాపార విస్తరణకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.
ధనుస్సు రాశి:
ఈ రాశి వారికి ఈ సమయం ఆదాయ వృద్ధికి, నూతన పరిచయాలకు బాగా కలిసి వస్తుంది. నూతన వ్యక్తులతో ఏర్పడే సంబంధాలు భవిష్యత్తు ప్రణాళికలకు ఎంతో ఉపకరిస్తాయి. వ్యాపారంలో పెద్ద మొత్తంలో కొత్త కాంట్రాక్టులు దక్కే అవకాశం ఉంది.
మకర రాశి:
కెరీర్ పరంగా మకర రాశి వారికి అత్యంత అనుకూలమైన కాలం. ఉద్యోగంలో కీలక బాధ్యతలు వరిస్తాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం, పై అధికారుల నుంచి గుర్తింపు లభిస్తాయి. వ్యాపారవేత్తలకు నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది అనువైన సమయం.
కుంభ రాశి:
కుంభ రాశి వారికి భాగ్య స్థానంలో శుక్రుడి ప్రభావం వల్ల అన్ని రంగాల్లోనూ కలిసొస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో నూతన మార్గాలు తెరుచుకుంటాయి. విదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్య లేదా దూర ప్రాంత పరిచయాలు ఊహించని ప్రయోజనాలను చేకూరుస్తాయి.
సెప్టెంబర్ 2న మొదలైన ఈ శుక్ర గోచారం నవంబర్ 6 వరకు తులారాశిలోనే కొనసాగి, ఆ తర్వాత కన్యా రాశిలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి సెప్టెంబర్, అక్టోబర్ నెలలతో పాటు నవంబర్ ప్రారంభం వరకు మొత్తం 65 రోజుల పాటు ఈ రాశుల వారికి ధన యోగం, కెరీర్ అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం లభించనున్నాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

