సెప్టెంబర్ 7న బుధాదిత్య రాజయోగం.. ఎవరికి ఫలిస్తుంది? ఈ 3 రాశులకు మహా అదృష్టం!
సెప్టెంబర్ 7న బుధుడు కన్యా రాశిలోకి ప్రవేశించడం, త్వరలో సూర్యుడు కూడా అదే రాశిలోకి రావడంతో బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధుడు మేధస్సుకు, సూర్యుడు ఆత్మవిశ్వాసం, అధికారానికి ప్రతీకలుగా భావిస్తారు.
జ్యోతిషశాస్త్రంలో గ్రహాల కలయిక ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ముఖ్యంగా మేధస్సుకు ప్రతీక అయిన బుధుడు, ఆత్మకారకుడైన సూర్యుడు కలవడం వల్ల అత్యంత శక్తివంతమైన 'బుధాదిత్య రాజయోగం' ఏర్పడుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 7న బుధుడు కన్యా రాశిలోకి సంచారం చేయబోతున్నారు. త్వరలోనే సూర్య భగవానుడు కూడా ఇదే రాశిలోకి ప్రవేశించనున్నారు. ఈ రెండు గ్రహాల కలయికతో ఏర్పడే ఈ అరుదైన యోగం కొందరి జీవితాల్లో అనూహ్య మార్పులను తీసుకురానుంది. అయితే, ఈ యోగం ఎవరికి ఎలా ఫలితాలను ఇస్తుంది? ఏయే సందర్భాల్లో ఈ రాజయోగం తన పూర్తి ప్రభావాన్ని చూపలేదో వివరంగా తెలుసుకుందాం.

బుధాదిత్య రాజయోగం ఎప్పుడు ఫలించదు?
సూర్యుడు, బుధులు ఒకే రాశిలో కలిసినంత మాత్రాన ప్రతి ఒక్కరికీ ఈ రాజయోగం ఫలితం దక్కుతుందని చెప్పలేం. జ్యోతిష నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ యోగం పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వడానికి కొన్ని కఠినమైన నిబంధనలు ఉంటాయి. జాతకంలో ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ యోగం నిష్ఫలమవుతుంది.
బుధ అస్తంగత: సూర్య భగవానుడికి అతి సమీపంలో బుధుడు సంచరిస్తున్నప్పుడు అస్తమిస్తాడు. ఇలా బుధుడు అస్తమించిన స్థితిలో ఉంటే, ఎంతటి గొప్ప రాజయోగం ఉన్నా ఆశించిన ఫలితాలు రావు.
గ్రహాల బలాబలాలు: జాతక చక్రంలో ఈ రెండు గ్రహాల డిగ్రీలు, వాటి బలాన్ని కచ్చితంగా పరిశీలించాలి. ఒకవేళ సూర్య-బుధులు బలహీనంగా ఉంటే, ఆ కలయిక వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.
స్థాన బలం: కుండలిలో ఈ యోగం ఏ స్థానంలో ఏర్పడుతుందనేది చాలా ముఖ్యం. కొన్ని ప్రత్యేక స్థానాల్లో ఈ కలయిక ఏర్పడినప్పుడు దాని ప్రభావం తగ్గిపోతుంది. కాబట్టి కేవలం గ్రహాల కలయికను మాత్రమే కాకుండా, వాటి సమగ్ర స్థితిని విశ్లేషించుకోవడం చాలా అవసరం.
ఏయే రాశుల వారికి ఈ యోగం అదృష్టాన్ని తెస్తుంది?
ఈ బుధాదిత్య రాజయోగం ప్రధానంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలను చేకూర్చనుంది. ఆ రాశుల వివరాలు చూద్దాం.
మేష రాశి: మేష రాశి వారికి ఈ రాజయోగం ఎంతో శుభఫలితాలను అందిస్తుంది. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాబడి పెరుగుతుంది. ఇతరుల సహాయం కోరే పరిస్థితి రాదు. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది, ఇది మిమ్మల్ని జీవితంలో మరింత ముందుకు నడిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా బలపడుతుంది.
కన్యా రాశి: స్వయంగా కన్యా రాశిలోనే ఈ యోగం ఏర్పడుతుండటం విశేషం. ఈ రాశి వారికి ధన లాభం అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగం చేసే వారికి ఆఫీసులో నూతన బాధ్యతలు అప్పగిస్తారు. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రముఖుల నుంచి గుర్తింపు లభించే అవకాశాలున్నాయి.
తులా రాశి: బుధుడి సంచారం వల్ల తులా రాశి వారి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. మీ మాటతీరుతో అందరినీ ఆకట్టుకుని పనులు సాధించుకుంటారు. నూతన ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కెరీర్ పరంగా మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వివాహ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


