...
...
Next Story

చర్లపల్లి - విశాఖ మధ్య మరిన్ని సంక్రాంతి ప్రత్యేక రైళ్లు - ఆగే స్టేషన్లు, తేదీలివిగో

సంక్రాంతి వేళ దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. చర్లపల్లి - విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు వీటిని ఆపరేట్ చేయనుంది.

Published on: Jan 07, 2026 11:33 AM IST
Advertisement

సంక్రాంతి పండగ సమీపించిన నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. బస్ స్టాండ్లు మాత్రమే కాకుండా రైల్వే స్టేషన్లలోనూ రద్దీ ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దక్షిణ మద్య రైల్వే పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయితే విశాఖపట్నం - చర్లపల్లి రూట్ లో మరో 2 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.

ప్రత్యేక రైళ్లు (image source @GMSRailway)
ప్రత్యేక రైళ్లు (image source @GMSRailway)

దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం... విశాఖపట్నం - చర్లపల్లి(ట్రైన్ నెంబర్ 08513) మధ్య ప్రత్యేక రైలు జనవరి 18న అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ విశాఖ నుంచి రాత్రి 11 గంటలకు బయల్దేరి... మరునాడు ఉదయం 10.30 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది.

ఇక చర్లపల్లి - విశాఖపట్నం (రైలు నెంబర్ 08514) మధ్య జనవరి 19వ తేదీన మరో స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఈ రైలు చర్లపల్లి స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు బయల్దేరి... మరునాడు ఉదయం 7 గంటలకు విశాఖపట్నంకు చేరుకుంటుంది.

ఆగే స్టేషన్లు…

ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, సామల్ కోట, అనపర్తి. రాజమండ్రి,ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాజ్ కోచ్ లు ఉంటాయి. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటన ద్వారా కోరారు.

మరోవైపు సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని.. హైదరాబాద్ నగరంలో ఉండేవారికి సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్, లింగంపల్లి నుంచి నడిచే 16 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హైటెక్ సిటీ స్టేషన్‌లో, సికింద్రాబాద్ టూ విజయవాడ మార్గంలో నడిచే మరో 11 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు చర్లపల్లిలో ప్రత్యేకంగా హాల్ట్‌లను ఏర్పాటు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. ఈ సదుపాయం ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. దీంతో సంక్రాంతికి ఇంటికి వెళ్లేవారికి, తిరిగి వచ్చేవారికి స్పెషల్ ట్రైన్స్ ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe