సంక్రాంతికి మరో 11 స్పెషల్ ట్రైన్లు.. ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

సంక్రాంతి సందర్భంగా పలు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే ప్రకటించింది. తాజాగా మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టుగా తెలిపింది.

Published on: Dec 30, 2025, 15:04:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండుగ దృష్ట్యా పలు ప్రత్యేక రైళ్లను ఇప్పటికే ప్రకటించింది. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య ఇప్పటికే అనేక రైళ్లను సంక్రాంతి పండగ సందర్భంగా నడిపేందుకు సిద్ధమైంది. తాజాగా మరో 11 స్పెషల్ ట్రైన్లను సౌత్ సెంట్రల్ రైల్వే అనౌన్స్ చేసింది.

దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

జనవరి 7వ తేదీ నుంచి 12వ తేదీ మధ్యలో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. సంక్రాంతి ఏపీకి వెళ్లి తిరిగి రావాలి అనుకునేవారికి ఈ ట్రైన్లు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనున్నాయి. కాకినాడ-వికారాబాద్, వికారాబాద్-పార్వతీపురం, పార్వతీపురం-వికారాబాద్, పార్వతీపురం-కాకినాడ టౌన్, సికింద్రాబాద్-పార్వతీపురం, కాకినాడ టౌన్-వికారాబాద్ మధ్య ఈ రైళ్లు నడుస్తాయని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.

ఈ ప్రత్యేక రైళ్లలో 1ఏసీ, 2ఏసీ, 3ఏసీ, స్లీపర్‌ కోచ్‌లతో పాటు సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు కూడా ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆంధ్రా-తెలంగాణ మధ్య జనవరి 7వ తేదీ నుంచి జనవరి 12వ తేదీ మధ్య ప్రయాణించేవారు.. బుకింగ్స్ చేసుకోవచ్చు, ప్రారంభమయ్యాయి.

07460 కాకినాడ -వికారాబాద్ ప్రత్యేక రైలు 08.01.2026న కాకినాడలో సాయంత్రం 06:20 కి బయలుదేరుతుందిఈ ట్రైన్ మరుసటి రోజు ఉదయం 08:00 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.

07461 వికారాబాద్ -పార్వతీపురం ట్రైన్ 09.01.2026,11.09.2026 తేదీల్లో వికారాబాద్ నుండి రాత్రి 08:30కి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 02:30కి పార్వతీపురం చేరుకుంటుంది.

07462 పార్వతీపురం-వికారాబాద్ స్పెషల్ ట్రైన్ 10.01.2026న సాయంత్రం 06:30కి పార్వతీపురంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:30కి వికారాబాద్ చేరుకుంటుంది.

07463 పార్వతీపురం-కాకినాడ ప్రత్యేక రైలు 12.01.2026న సాయంత్రం 6:30కి పార్వతీపురంలో బయలుదేరి మరుసటి రోజు అంటే.. 13.01.2026 అర్ధరాత్రి ఒంటి గంటకు కాకినాడ చేరుకుంటుంది.

07464 సికింద్రాబాద్-పార్వతీపురం 08.1.2026న రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరే ఈ ట్రైన్ మరుసటి రోజు మధ్యాహ్నం 2:30కి పార్వతీపురం వస్తుంది.

07465 పార్వతీపురం-సికింద్రాబాద్ 09.01.2026న సాయంత్రం 6:30కి పార్వతీపురంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.

07186 కాకినాడ-వికారాబాద్ ప్రత్యేక రైలు 07.01.2026,09.01.2026 తేదీల్లో కాకినాడలో సాయంత్రం 4:45కి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 7గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.

07185 వికారాబాద్-కాకినాడ రైలు 08.01.2026న వికారాబాద్‌లో సాయంత్రం 05:35కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:30కి కాకినాడ టౌన్ చేరుకుంటుంది.

07187 వికారాబాద్-కాకినాడ రైలు 10.01.2026న సాయంత్రం 7 గంటలకు వికారాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు కాకినాడ చేరుకుంటుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More