క్రిస్‌మస్‌ వేడుకలకు సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్-వేలాంకణి మధ్య ప్రత్యేక రైళ్లు

క్రిస్‌మస్‌ వేడుకల సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు వివరాలు వెల్లడించింది.

Published on: Dec 23, 2025, 16:44:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వేలాంకణి చర్చిలో క్రిస్‌మస్‌ ఉత్సవాలకు హాజరయ్యే వారికోసం దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించింది. 07407 ప్రత్యేకరైలు 23న అంటే మంగళవారం రాత్రి 7.25గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి.. బుధవారం సాయంత్రం 5.30గంటలకు వేలాంకణి చేరుకుంటుంది.

దక్షిణ మధ్య ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య ప్రత్యేక రైళ్లు

ఇక తిరుగు ప్రయాణంలో 07408 స్పెషల్ రైలు.. 25న గురువారం ఉదయం 8గంటలకు వేలాంకణిలో బయలుదేరుతుంది. శుక్రవారం ఉదయం 6.10గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుందని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.

ఈ ప్రత్యేక రైళ్లు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడురు, చెన్నై, తంబారం, చెంగలపట్టు, మేల్మరువత్తూర్, విల్లుపురం, తిరుప్పులియూర్, చిదంబరం, మయిలదుతురై, కరైకల్, నాగోర్, నాగపట్నం స్టేషన్లలో ఆగుతాయి.

మంగళూరు – చెన్నై సెంట్రల్ క్రిస్మస్ ప్రత్యేక రైలు

మంగళూరు – చెన్నై సెంట్రల్ మధ్య కూడా క్రిస్మస్ ప్రత్యేక రైలును నడుపుతోంది భారతీయ రైల్వే. రైలు నెం: 06126 (మంగళూరు - చెన్నై సెంట్రల్) డిసెంబర్ 23, 30 తేదీలలో ఉదయం 3:10 గంటలకు మంగళూరు నుండి బయలుదేరుతుంది. డిసెంబర్ 24, 31 తేదీలలో రాత్రి 11:30 గంటలకు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో చేరుకుంటుంది.

రైలు నెం: 06125 (చెన్నై సెంట్రల్ - మంగళూరు) చెన్నై నుంచి డిసెంబర్ 24, 31 తేదీలలో ఉదయం 4:15 గంటలకు బయలుదేరుతుంది. డిసెంబర్ 25, జనవరి 1 తేదీలలో మంగళూరు చేరుకుంటుంది.

తిరువళ్లూరు, అరక్కోణం, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పోదనూర్, పాలక్కాడ్‌తోపాటుగా ఇతర ముఖ్యమైన స్టేషన్లనలో ఆగుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లు క్రిస్మస్ వేడుకలకు, సెలవులు ఉన్నవారికి ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఇవి తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతటా కనెక్టివిటీని అందిస్తాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More