ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య రాసిన లేఖకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. విజయసాయిరెడ్డి తన సోషల్ మీడియా ఖాతాల్లో లెటర్‌లోని విషయాలను పోస్ట్ చేశారు. 'పదేళ్ళ వయసున్న రియాన్ష్ రెడ్డి తల్లి, ఆత్మహత్యకు పాల్పడ్డ సౌజన్య... తన మరణ వాంగ్మూలంలో ఏం చెప్పారో ప్రతి ఒక్కరికీ తెలియాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళా ఈ అంశాలు చదవాలి. ఇది లవ్ జిహాద్‌కు సంబంధించిన ఘటన. రాజకీయ పార్టీలు ఇలాంటి అంశాలను కూడా బయటకు రాకుండా తొక్కిపెడుతున్నాయి కాబట్టి, ప్రజలందరి దృష్టికీ రావాల్సిన ఆమె లెటర్‌లోని రిలవెంట్ అంశాలను ప్రజల ముందు ఉంచుతున్నాను.' అని విజయసాయిరెడ్డి అన్నారు.

ఇప్పుడు ఈ లేఖతో కాకినాడ జిల్లాలో నూకరాజు కుటుంబం ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటనకు సంబంధించి దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడు నూకరాజు కుమార్తె సౌజన్య రాసిన సుదీర్ఘమైన సూసైడ్ నోట్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సాధిక్ అనే వ్యక్తి పెట్టిన తీవ్ర వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్, దాడుల వల్లే తమ కుటుంబం ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ లేఖలో పేర్కొంది.
సౌజన్య తెలిపిన వివరాల ప్రకారం... సాధిక్ అనే వ్యక్తి ఆమె కొడుకుకు స్పోర్ట్స్ కోచ్‌గా పరిచయమై కుటుంబంలోకి ప్రవేశించాడు. ఇంట్లోని వ్యక్తిగత విషయాలు, ఆర్థిక పరిస్థితులు తెలుసుకుని, ప్రైవేట్ వీడియోలు, ఫొటోలు అడ్డుపెట్టుకుని తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు. ఎదిరించిన ప్రతిసారీ విచక్షణారహితంగా దాడి చేసేవాడని, చివరికి ఆమె భర్తను మందు ఇచ్చి హత్య చేశాడని ఆరోపించింది.
తాళాలు, బ్యాంకు లాకర్ కీలు, ఒరిజినల్ ఆస్తి పత్రాలు సాధిక్ తన ఆధీనంలో ఉంచుకున్నాడని, కొడుకుని కిడ్నాప్ చేస్తానని బెదిరిస్తూ తమను 24/7 ఫోన్ లైన్లోనే ఉంచేవాడని లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. మతం మారాలని కూడా ఒత్తిడి తెచ్చాడని, 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పాడ సముద్రంలోకి తోసేసి ప్రాణభయానికి గురిచేశాడని పేర్కొంది.
పోలీసులతో తనకు సంబంధాలు ఉన్నాయని బెదిరించడం, తల్లిదండ్రులు, బిడ్డ ప్రాణాలకు రక్షణ లేకపోవడంతో వేధింపులు భరించలేక తామంతా కలిసి ఈ ప్రపంచాన్ని వీడుతున్నామని సూసైడ్ నోట్లో సౌజన్య వివరించింది. తన ఆస్తులన్నీ బ్యాంకు రుణాలు తీర్చడానికి, అనాథ శరణాలయాలకు, అత్తమామలకు చెందాలని, సాధిక్‌కు ఒక్క రూపాయి కూడా దక్కకూడదని స్పష్టం చేసింది.
{{/usCountry}}పోలీసులతో తనకు సంబంధాలు ఉన్నాయని బెదిరించడం, తల్లిదండ్రులు, బిడ్డ ప్రాణాలకు రక్షణ లేకపోవడంతో వేధింపులు భరించలేక తామంతా కలిసి ఈ ప్రపంచాన్ని వీడుతున్నామని సూసైడ్ నోట్లో సౌజన్య వివరించింది. తన ఆస్తులన్నీ బ్యాంకు రుణాలు తీర్చడానికి, అనాథ శరణాలయాలకు, అత్తమామలకు చెందాలని, సాధిక్‌కు ఒక్క రూపాయి కూడా దక్కకూడదని స్పష్టం చేసింది.
{{/usCountry}}సాధిక్ వాడే ఫోన్ నంబర్లు, కారు వివరాలను కూడా ఆ లేఖలో వెల్లడించింది. ఈ సూసైడ్ నోట్ ఆధారంగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, బంధువులు కోరుతున్నారు. మరోవైపు ఈ సామూహిక ఆత్మహత్యలకు కారకుడైన సాధిక్‌ను పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏఎస్పీ, ఐదుగురు సీఐల బృందం అతడిని ప్రశ్నించింది.