ఏఈ నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ కేసు.. కన్నీళ్లు పెట్టిస్తున్న సౌజన్య మరణ వాంగ్మూలం!
Soujanya Suicide Note : ఏఈ నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ కేసులో మరో విషయం సంచలనంగా మారింది. కుమార్తె సౌజన్య మరణ వాంగ్మూలం బయటకు వచ్చింది. విజయసాయిరెడ్డి లెటర్‌కు సంబంధించిన విషయాలను పంచుకున్నారు.
ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య రాసిన లేఖకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. విజయసాయిరెడ్డి తన సోషల్ మీడియా ఖాతాల్లో లెటర్‌లోని విషయాలను పోస్ట్ చేశారు. 'పదేళ్ళ వయసున్న రియాన్ష్ రెడ్డి తల్లి, ఆత్మహత్యకు పాల్పడ్డ సౌజన్య... తన మరణ వాంగ్మూలంలో ఏం చెప్పారో ప్రతి ఒక్కరికీ తెలియాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళా ఈ అంశాలు చదవాలి. ఇది లవ్ జిహాద్‌కు సంబంధించిన ఘటన. రాజకీయ పార్టీలు ఇలాంటి అంశాలను కూడా బయటకు రాకుండా తొక్కిపెడుతున్నాయి కాబట్టి, ప్రజలందరి దృష్టికీ రావాల్సిన ఆమె లెటర్‌లోని రిలవెంట్ అంశాలను ప్రజల ముందు ఉంచుతున్నాను.' అని విజయసాయిరెడ్డి అన్నారు.

ఇప్పుడు ఈ లేఖతో కాకినాడ జిల్లాలో నూకరాజు కుటుంబం ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటనకు సంబంధించి దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడు నూకరాజు కుమార్తె సౌజన్య రాసిన సుదీర్ఘమైన సూసైడ్ నోట్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సాధిక్ అనే వ్యక్తి పెట్టిన తీవ్ర వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్, దాడుల వల్లే తమ కుటుంబం ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ లేఖలో పేర్కొంది.
సౌజన్య తెలిపిన వివరాల ప్రకారం... సాధిక్ అనే వ్యక్తి ఆమె కొడుకుకు స్పోర్ట్స్ కోచ్‌గా పరిచయమై కుటుంబంలోకి ప్రవేశించాడు. ఇంట్లోని వ్యక్తిగత విషయాలు, ఆర్థిక పరిస్థితులు తెలుసుకుని, ప్రైవేట్ వీడియోలు, ఫొటోలు అడ్డుపెట్టుకుని తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు. ఎదిరించిన ప్రతిసారీ విచక్షణారహితంగా దాడి చేసేవాడని, చివరికి ఆమె భర్తను మందు ఇచ్చి హత్య చేశాడని ఆరోపించింది.
తాళాలు, బ్యాంకు లాకర్ కీలు, ఒరిజినల్ ఆస్తి పత్రాలు సాధిక్ తన ఆధీనంలో ఉంచుకున్నాడని, కొడుకుని కిడ్నాప్ చేస్తానని బెదిరిస్తూ తమను 24/7 ఫోన్ లైన్లోనే ఉంచేవాడని లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. మతం మారాలని కూడా ఒత్తిడి తెచ్చాడని, 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పాడ సముద్రంలోకి తోసేసి ప్రాణభయానికి గురిచేశాడని పేర్కొంది.
పోలీసులతో తనకు సంబంధాలు ఉన్నాయని బెదిరించడం, తల్లిదండ్రులు, బిడ్డ ప్రాణాలకు రక్షణ లేకపోవడంతో వేధింపులు భరించలేక తామంతా కలిసి ఈ ప్రపంచాన్ని వీడుతున్నామని సూసైడ్ నోట్‌లో సౌజన్య వివరించింది. తన ఆస్తులన్నీ బ్యాంకు రుణాలు తీర్చడానికి, అనాథ శరణాలయాలకు, అత్తమామలకు చెందాలని, సాధిక్‌కు ఒక్క రూపాయి కూడా దక్కకూడదని స్పష్టం చేసింది.
సాధిక్ వాడే ఫోన్ నంబర్లు, కారు వివరాలను కూడా ఆ లేఖలో వెల్లడించింది. ఈ సూసైడ్ నోట్ ఆధారంగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, బంధువులు కోరుతున్నారు. మరోవైపు ఈ సామూహిక ఆత్మహత్యలకు కారకుడైన సాధిక్‌ను పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏఎస్పీ, ఐదుగురు సీఐల బృందం అతడిని ప్రశ్నించింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


