AIIMS Mangalagiri Recruitment : మంగళగిరి ఎయిమ్స్‌లో 36 ఉద్యోగాలు - దరఖాస్తుకు ఆగస్టు 5 ఆఖరు తేదీ!
AIIMS Mangalagiri Recruitment 2026 : సీనియర్ రెసిడెంట్, సీనియర్ డెమోన్‌స్ట్రేటర్ పోస్టుల భర్తీకి మంగళగిరి ఎయిమ్స్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 36 ఖాళీలున్నాయి. ఆగస్టు 5 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
AIIMS Mangalagiri Recruitment 2026 : ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), మంగళగిరి నుంచి ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేందుకు సీనియర్ రెసిడెంట్, సీనియర్ డెమోన్‌స్ట్రేటర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. మొత్తం 36 ఖాళీల భర్తీకి సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

విభాగాల వారీగా ఖాళీలు…
అనస్థీషియాలజీ (6), అనాటమీ (1), బయోకెమిస్ట్రీ (1), కార్డియోథొరాసిక్ సర్జరీ (1), కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ (1), ఈఎన్‌టీ (2), ఫోరెన్సిక్ మెడిసిన్ & టాక్సికాలజీ (2), జనరల్ సర్జరీ (2), మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ (2), మైక్రోబయాలజీ (1), అబ్స్టెట్రిక్స్ & గైనకాలజీ (2), ఆర్థోపెడిక్స్ (1), పాథాలజీ (2), ఫార్మకాలజీ (1), ఫిజికల్ మెడిసిన్ & రిహాబిలిటేషన్ (3), సైకియాట్రీ (2), రేడియేషన్ ఆంకాలజీ (1), రేడియోడయాగ్నోసిస్ (2), ట్రౌమా అండ్ ఎమర్జెన్సీ (3) విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి.
ముఖ్య వివవరాలు…
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి సంబంధిత విభాగంలో ఎండీ (MD), ఎంఎస్ (MS), డీఎన్‌బీ , డీఎం లేదా ఎంసీహెచ్ ఉత్తీర్ణులై ఉండాలి.
- నాన్-మెడికల్/డెమోన్‌స్ట్రేటర్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో ఎంఎస్సీ / ఎం.బయోటెక్ తో పాటు పీహెచ్‌డీ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు ముగింపు తేదీ నాటికి కోర్సు పూర్తి కావడం తప్పనిసరి.
- దరఖాస్తు ముగింపు తేదీ నాటికి గరిష్ట వయస్సు 45 ఏళ్లు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- ఈ పోస్టులకు ఎంపిక పూర్తిగా ఇంటర్వ్యూ ఆధారంగానే జరుగుతుంది. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి…. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ గూగుల్ ఫామ్ (Google Form) లింక్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలి. (డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఉండదు).
- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 1,500; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 1,000 ఫీజుగా నిర్ణయించారు. పీడబ్ల్యూబీడీ (PwBD) అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 05 ఆగస్టు 2026.
- అభ్యర్థులు సమగ్ర వివరాల కోసం మంగళగిరి ఎయిమ్స్ అధికారిక వెబ్‌సైట్ www.aiimsmangalagiri.edu.in ను సందర్శించవచ్చు.
ఈ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను తెలుసుకోవచ్చు
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

