హైదరాబాద్ ఐసీఏఆర్-ఐఐఓఆర్ జాబ్ నోటిఫికేషన్.. వాక్-ఇన్ ఇంటర్వ్యూ వివరాలు ఇవే!
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్-ఐఐఓఆర్‌లో జాబ్ నోటిపికేషన్ విడుదలైంది. ఇంటర్వ్యూ ద్వారానే ఈ పోస్టుకు ఎంపిక చేస్తారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్ - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌సీడ్స్ రీసెర్చ్ (ICAR-IIOR) ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 'సీడ్ హబ్ రివాల్వింగ్ ఫండ్ ప్రాజెక్ట్' కింద తాత్కాలిక ప్రాతిపదికన ఒక యంగ్ ప్రొఫెషనల్ పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టుకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పోస్టు పేరు: యంగ్ ప్రొఫెషనల్-I, ఖాళీల సంఖ్య: 01 పోస్టు , నెలవారీ వేతనం: రూ. 30,000 ఇంటర్వ్యూ తేదీ: 16 జూలై, 2026 , రిపోర్టింగ్ సమయం: ఉదయం 9:30 గంటల నుండి 10:30 గంటల వరకు మాత్రమే.
అభ్యర్థులు అగ్రికల్చర్, బోటనీ, లేదా క్రాప్ ప్రొడక్షన్ విభాగాల్లో బీఎస్సీ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సన్‌ఫ్లవర్, సాఫ్లవర్, కాస్టర్, నువ్వుల పంటల బ్రీడర్ సీడ్ ప్రొడక్షన్, ప్రాసెసింగ్, పోస్ట్-హార్వెస్ట్ పనుల్లో 1 నుండి 3 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. వీటితో పాటు ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్ పరిజ్ఞానం, డేటా స్కిల్స్, పొలంలో బయోమెట్రిక్ డేటా నమోదు చేయగల ఫీల్డ్ ఎక్స్‌పోజర్ ఉండాలి.
ఇంటర్వ్యూ తేదీ (16.07.2026) నాటికి అభ్యర్థుల కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఈ నియామకం పూర్తిగా ఒప్పంద ప్రాతిపదికన గరిష్టంగా మూడేళ్ల కాలపరిమితికి లోబడి ఉంటుంది. ప్రాథమికంగా ఏడాది పాటు నియమించి, అభ్యర్థి ప్రతిభ ఆధారంగా పొడిగిస్తారు. ఇంటర్వ్యూకి కనీసం ఐదుగురు అభ్యర్థులు హాజరైతేనే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఒకవేళ అభ్యర్థుల సంఖ్య 20 దాటితే మొదట రాత పరీక్ష నిర్వహించి, షార్ట్‌లిస్ట్ అయిన వారికి అదే రోజు ఇంటర్వ్యూ చేస్తారు.
ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారంతో పాటు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలు, ఫోటోతో జూలై 16న నేరుగా ఐసీఏఆర్-ఐఐఓఆర్ (ICAR-IIOR), రాజేంద్రనగర్, హైదరాబాద్ కార్యాలయానికి హాజరుకావచ్చు. ఎలాంటి టీఏ/డీఏ చెల్లించరు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


