AIIMS Mangalagiri Recruitment 2026 : మంగళగిరి ఎయిమ్స్‌లో ఖాళీలు.. నెలకు రూ. 67,700 శాలరీ!

AIIMS Mangalagiri Recruitment 2026 : మంగళగిరి ఎయిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తు విధానం, ఇతర వివరాలను తెలుసుకోండి.

Published on: Nov 29, 2026, 13:03:26 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ వైద్య విద్యాసంస్థ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(AIIMS Mangalagiri) నిరుద్యోగ వైద్య అభ్యర్థులకు శుభవార్త అందించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థలో సీనియర్ రెసిడెంట్స్ / సీనియర్ డిమాన్‌స్ట్రేటర్స్ (నాన్-అకడమిక్) పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది.

మంగళగిరి ఎయిర్స్ ఉద్యోగాలు (Facebook)
మంగళగిరి ఎయిర్స్ ఉద్యోగాలు (Facebook)

గరిష్టంగా మూడేళ్ల కాలపరిమితితో (రెసిడెన్సీ స్కీమ్ కింద) భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో అన్-రిజర్వ్‌డ్ విభాగానికి 2, ఈడబ్ల్యూఎస్ విభాగానికి 1 పోస్టును కేటాయించారు.

అనాటమీ 1 సంబంధిత విభాగంలో MD/DNB లేదా సంబంధిత సబ్జెక్టులో M.Sc/M.Biotechతో పాటు Ph.D పూర్తి చేసి ఉండాలి. మెడికల్ హెమటాలజీ 2 (UR-1, EWS-1) మెడిసిన్ లేదా పీడియాట్రిక్స్‌లో MD/DNB లేదా క్లినికల్ హెమటాలజీలో DM/DrNB ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 45 సంవత్సరాలకు మించకూడదు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు కేటగిరీని బట్టి 10 నుండి 15 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపికైన మెడికల్ అభ్యర్థులకు 7వ వేతన సంఘం పే లెవల్-11 ప్రకారం నెలకు రూ.67,700 ప్రారంభ వేతనంతో పాటు ఎన్పీఏ, ఇతర అలవెన్సులు లభిస్తాయి. నాన్-మెడికల్ అభ్యర్థులకు పే లెవల్-10 కింద రూ. 56,100, ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.

ఈ పోస్టులకు నేరుగా వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదని ఎయిమ్స్ స్పష్టం చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ 2026 డిసెంబర్ 12గా నిర్ణయించారు. అభ్యర్థులు నోటిఫికేషన్‌లో ఇచ్చిన గూగుల్ ఫారమ్ లింక్ ([https://forms.gle/6ucKaez9XqGtTdF49](https://forms.gle/6ucKaez9XqGtTdF49)) ద్వారా తమ దరఖాస్తు ఫారమ్, అవసరమైన సర్టిఫికెట్లు, ఫీజు చెల్లించిన రసీదును స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.

జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ. 1,500, ఎస్టీ/ఎస్టీ అభ్యర్థులు రూ.1,000 ఫీజు చెల్లించాలి. దివ్యాంగులకు ఫీజు నుండి పూర్తి మినహాయింపు ఉంది. ఈ మొత్తాన్ని NEFT లేదా యూపీఐ ద్వారా 'AIIMS MANGALAGIRI - RECEIPTS' (ఖాతా నంబర్: 38321557910, IFSC: SBIN0061485, SBI AIIMS Mangalagiri Branch) ఖాతాకు జమ చేయాలి.

అభ్యర్థుల ఎంపిక కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఒకవేళ దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉంటే, సంబంధిత సబ్జెక్టులో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి, అందులో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలను త్వరలోనే సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.

ఎంపికైన అభ్యర్థులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీలుండదు. ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు Annexure-I, Annexure-II ఫారాలను నింపి తీసుకురావాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలు కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు www.aiimsmangalagiri.edu.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే srrecruitment@aiimsmangalagiri.edu.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.