డిసెంబర్ 3 నాటికి దివ్యాంగుల కోసం 6,997కు పైగా స్వయం సహాయక బృందాలు.. రూ.25వేలు ఆర్థికసాయం
తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 3 నాటికి దివ్యాంగుల కోసం 6,997 స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయాలని టార్గెట్ పెట్టుకుంది.
దివ్యాంగుల ఆర్థిక రక్షణ, వారి స్వయం సమృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల కోసం 6,997 కొత్త స్వయం సహాయక సంఘాలను (SHG) ఏర్పాటు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనితో పాటు డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్(DRF) భాగస్వామ్యంతో దివ్యాంగులకు స్వయం ఉపాధి, ఉపాధి అవకాశాలను పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.

తెలంగాణ పట్టణ పేదరికా నిర్మూలన సంస్థ(MEPMA), డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ మధ్య ఈ మేరకు అవగాహనా ఒప్పందం కుదిరింది. 20 నుండి 45 సంవత్సరాల వయస్సు కలిగిన 3,000 మందికి పైగా ఆసక్తి, అర్హత ఉన్న దివ్యాంగులను గుర్తించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే చిన్నపాటి వ్యాపారాలు చేస్తున్న వారిని లేదా కొత్తగా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారిని గుర్తించి, వారి వ్యాపారాలను లాభసాటిగా మార్చేందుకు సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని అందిస్తారు.
జిహెచ్‌ఎంసి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌లతో పాటు రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఈ కార్యక్రమం విస్తరించనుంది. రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో ఉన్న ప్రతి స్లమ్ లెవల్ ఫెడరేషన్ పరిధిలో కనీసం ఒక దివ్యాంగుల స్వయం సహాయక సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతర్జాతీయ దివ్యాంగుల రోజైన డిసెంబర్ 3, 2026 నాటికి ఈ 6,997 గ్రూపుల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.
ఇప్పటికే స్వయం ఉపాధిలో ఉండి, ఎలాంటి ఎస్‌హెచ్‌జీల్లో సభ్యులుగా లేని దివ్యాంగులను కూడా వెంటనే గుర్తించి, వారిని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(EDP)లో భాగస్వాములను చేయాలని జిల్లా అధికారులు, పురపాలక అధికారులకు మెప్మా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్, మెప్మాతో కలిసి అర్హులైన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఎంపిక చేస్తుంది. ఎంపిక చేసిన లబ్ధిదారులకు వారి వ్యాపార అవసరాలు, వృద్ధి అవకాశాల ఆధారంగా గరిష్టంగా రూ.25,000 వరకు సీడ్ గ్రాంట్ అందిస్తారు. వ్యక్తిగత బిజినెస్ ప్లాన్‌కు అనుగుణంగా యంత్రాలు, పరికరాలు, అవసరమైన ముడి సరకులు కొనుగోలు చేయడానికి ఈ నిధులను ఉపయోగిస్తారు.
లబ్ధిదారులకు వ్యాపార నిర్వహణ, ఆర్థిక యాజమాన్యంలో నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తారు. ఒకవేళ స్వయం ఉపాధి పొందేందుకు ఆసక్తి లేని దివ్యాంగులకు వేతనంతో కూడిన ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు జిల్లా స్థాయి బృందాలు స్వయం సహాయక సంఘాల వెలుపల ఉన్న దివ్యాంగ వ్యాపారులను కూడా గుర్తించి, వారి కోసం అవగాహన సదస్సులు నిర్వహిస్తాయి. ఈ సదస్సుల్లో అర్హతలు, పొందే ప్రయోజనాలు, దరఖాస్తు విధానాన్ని సమగ్రంగా వివరించనున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


