వ్యాపార సమస్యలు తొలగాలంటే ఈ పరిహారాలు చేయండి.. బుధుడు, వినాయకుడిని ఇలా పూజించండి!

వ్యాపారంలో హెచ్చుతగ్గులు సహజమే అయినప్పటికీ, వరుసగా నష్టాలు రావడం, కష్టపడ్డా ఆశించిన ఫలితాలు రాకపోవడం ఆందోళనకు కారణమవుతుంది. ఇలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు కొన్ని జ్యోతిష్య పరిహారాలను పాటించవచ్చని ఈ కథనం పేర్కొంటోంది. 

Published on: Oct 2, 2026, 16:01:10 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సమస్యల నుంచి బయటపడడానికి వివిధ పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు. వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా?

వ్యాపార సమస్యలు తొలగాలంటే ఈ పరిహారాలు చేయండి.. బుధుడు, వినాయకుడిని ఇలా పూజించండి!
వ్యాపార సమస్యలు తొలగాలంటే ఈ పరిహారాలు చేయండి.. బుధుడు, వినాయకుడిని ఇలా పూజించండి!

వ్యాపారంలో హెచ్చుతగ్గులు రావడం సహజమే. అయితే, వరుసగా నష్టాలు రావడం, కష్టాలతో సతమతం అవ్వడం వలన తీవ్ర ఆందోళనను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలో అర్థం కాదు కూడా. మీరు కూడా వ్యాపారానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారా? అయితే, ఈ పరిహారాలు మీకోసమే. వ్యాపార సమస్యల్ని సులువైన పరిహారాలతో తొలగించొచ్చు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ సులువైన జ్యోతిష్య పరిహారాలు బాగా పనిచేస్తాయి. ఈ పరిహారాలతో వ్యాపారానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. మరి, ఆ పరిహారాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

బుధ గ్రహాన్ని బలోపేతం చేయండి

బుధ గ్రహాన్ని వ్యాపారం, వాక్చాతుర్యం, లెక్కలతో అనుసంధానించి చూస్తారు. జాతకంలో బుధుడి స్థానం బలంగా ఉన్నట్లయితే వ్యాపారంలో విజయాలు ఉంటాయి. బుధుడిని బలోపేతం చేయడానికి బుధవారం నాడు ఆవుకి పచ్చ గడ్డిని తినిపించండి. అలాగే, “ఓం బుధాయ నమః” మంత్రాన్ని కూడా జపించండి.

వినాయకుడిని పూజించండి

వినాయకుడు జ్ఞానం, వివేకానికి అధిదేవత. వినాయకుడిని పూజిస్తే జీవితంలో ఉన్న ఆటంకాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి.

లక్ష్మీదేవి, కుబేరుడిని పూజించండి

ఆర్థిక సమృద్ధి, వ్యాపారంలో అభివృద్ధి కోసం లక్ష్మీదేవిని, కుబేరుని పూజించండి. దీని వలన వ్యాపారంలో సమస్యలు తొలగిపోతాయి. ధనధాన్యాలు కూడా లభిస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడడానికి వీలవుతుంది. వినాయకుని పూజ చేసేటప్పుడు బుధవారం నాడు వినాయకుడికి గరికపోచలను సమర్పించండి. భక్తిశ్రద్ధలతో వినాయకుడికి గరికను సమర్పించడం వలన కష్టాలు తొలగిపోతాయి.

నిమ్మకాయ, మిరపకాయల పరిహారం

దిష్టి, ప్రతికూలత కారణంగా కూడా వ్యాపారంలో సమస్యలు వస్తాయి. కనుక వీటిని వ్యాపార ప్రదేశంలో బయట వేలాడదీయండి. దీంతో మంచి ఫలితాలు చూస్తారు. శనివారం నాడు ఒక నిమ్మకాయ, ఏడు పచ్చి మిరపకాయలను నల్లదారంతో కట్టి ప్రధాన ద్వారానికి తగిలిస్తే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ప్రతికూలత నుంచి రక్షణ లభిస్తుంది.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారంపై, అవి పూర్తిగా నిజమైనవి మరియు ఖచ్చితమైనవి అని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More