Virosh: విరోష్ కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీగా రణబాలి- తెలంగాణ సాంప్రదాయాలు పాటించాలని రష్మికకు చెప్పిన విజయ్ దేవరకొండ

Vijay Deverakonda Rashmika Mandanna Ranabaali: స్టార్ క‌పుల్ విజయ్ దేవరకొండ, ర‌ష్మిక మంద‌న్న‌ా కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీగా రణబాలి సినిమా బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకెళ్తోంది. రణబాలి సినిమాకు 3 రోజుల్లో రూ. 36.90 కోట్ల కలెక్షన్స్ రాగా అందులో విజయ్ దేవరకొండ నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Published on: Oct 19, 2026, 13:05:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Vijay Deverakonda Rashmika Mandanna Ranabaali: టాలీవుడ్‌లో వైవిధ్య‌మైన చిత్రాల‌తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్‌ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘రణబాలి’. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో రూపొందిన మూడో చిత్ర‌మిది.

విరోష్ కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీగా రణబాలి- తెలంగాణ సాంప్రదాయాలు పాటించాలని రష్మికకు చెప్పిన విజయ్ దేవరకొండ
విరోష్ కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీగా రణబాలి- తెలంగాణ సాంప్రదాయాలు పాటించాలని రష్మికకు చెప్పిన విజయ్ దేవరకొండ

హ్యాట్రిక్ మూవీగా రణబాలి

ఈ హ్యాట్రిక్ మూవీ వీరిద్దరి కెరీర్‌లోనూ ఓ మైలురాయిగా నిలిచేలా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్ర‌తీ షోకు సినిమాకు క‌లెక్ష‌న్స్ పెరుగుతుండ‌ట‌మే ఈ సినిమా స‌క్సెస్‌కు నిద‌ర్శ‌నం. రణబాలి సినిమాకు వరల్డ్ వైడ్‌గా 3 రోజుల్లో రూ. 36.90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

విజయ్ దేవరకొండ నటన, ఆయన ఎంచుకున్న పాత్ర, తెరపై చూపించిన వైవిధ్యం గురించి ప్రేక్షకుల్లో చర్చ కొనసాగుతోంది. ఆయ‌న ఇప్పటి వరకు చేసిన పాత్రలకు భిన్నంగా ‘రణబాలి’లో కనిపించడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ.

హీరో ఇమేజ్‌కి పరిమితం కాకుండా

కథానాయకుడిగా తన ఇమేజ్‌కు పరిమితం కాకుండా, నటుడిగా కొత్త సవాళ్లను స్వీకరించేందుకు విజయ్ దేవరకొండ సిద్ధంగా ఉన్నారని ర‌ణ‌బాలి చిత్రం మరోసారి స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా పాత్ర కోసం ఆయన చూపించిన డేడికేష‌న్‌, తెరపై తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి.

ప్రస్తుతం యంగ్ స్టార్స్‌కు భిన్నంగా విజయ్ దేవరకొండ మాత్రం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయడం విశేషం. సాధారణంగా యువ కథానాయకులు చేయడానికి ఆసక్తి చూపని భిన్నమైన పాత్రను ఎంచుకుని, దానిలోకి పర‌కాయ ప్ర‌వేశం చేయ‌టం ఆయ‌న‌కే చెల్లింది.

సరికొత్త విజయ్‌ని చూశామంటూ

ఈ క్రమంలో ‘రణబాలి’ విజయ్‌లోని నటుడిని మరో మెట్టు ఎక్కించిన చిత్రంగా నిలుస్తోంది. మరోవైపు రష్మిక మందన్నాతో విజయ్ దేవరకొండ జోడీ కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. వీరిద్దరి కలయికకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, సినిమా చుట్టూ కొనసాగుతున్న చర్చలు ‘రణబాలి’కి అదనపు ఆకర్షణగా మారింది.

‘రణబాలి’ విషయంలో విజయ్ దేవరకొండ చేసిన ఎక్స్‌పెరిమెంట్‌, ఆయన నటనకు ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌స్తోంది. దేశ‌భ‌క్తిని పెంపొందించే పాత్ర‌లో ఆయ‌న ఒదిగిన తీరుకి జ‌నం నీరాజ‌నాలు ప‌డుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడ‌ని సరికొత్త విజయ్‌ను చూస్తున్నామ‌ని జ‌నం జేజేలు కొడుతున్నారు.

మూస పాత్రలకు దూరంగా

మొత్తంగా చూస్తే, ‘రణబాలి’ విజయ్ దేవరకొండ కెరీర్‌లో మరో భిన్నమైన ప్రయత్నం. మూస పాత్రలకు దూరంగా వెళ్లి కొత్త తరహా పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలనే ఆయన ప్రయత్నం మ‌రోసారి స‌క్సెస్ అయ్యింది. నటుడిగా తన పరిధిని విస్తరించుకుంటూ ముందుకు సాగుతున్న విజయ్ దేవరకొండ, ర‌ష్మిక‌ల‌కు ఈ సినిమా ఓ మైల్‌స్టోన్‌గా నిలిచింద‌న‌టంలో సందేహం లేదు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో విరోష్ జంట సందడి చేసింది. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పాల్గొన్నారు.

తెలంగాణ సాంప్రాదాయాలు పాటించాలని

స్టార్ జంట వేడుకల్లో పాల్గొనడంతో అక్కడి వాతావరణం మరింత సందడిగా మారింది. పెళ్లి తర్వాత తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను పాటించాలని రష్మికకు తాను ముందే చెప్పానని విజయ్ దేవరకొండ.. వివాహానంతరం తనకు ఇదే తొలి బతుకమ్మ పండుగ అని రష్మిక మందన్నా ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీంతో విరోష్ అభిమానుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More