Virosh: నా ఆప్యాయతను ఓవరాక్టింగ్, క్రింజ్ అనుకోండి: రష్మిక మందన్నా కామెంట్స్- నకిలీ ఖాతాలా కుట్ర ఉందన్న విజయ్ దేవరకొండ

Rashmika Mandanna Vijay Deverakonda On Trolling: తన ఆప్యాయతను 'ఓవరాక్టింగ్', 'క్రింజ్' అని విమర్శించే నెటిజన్ల ట్రైలింగ్‌పై నేషనల్ క్రష్ రష్మిక మందన్నా స్పందించారు. సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ వెనుక నకిలీ ఖాతాల కుట్ర ఉందని, ఏకంగా ఓ వ్యవస్థనే నడుపుతన్నారని విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Published on: Oct 5, 2026, 14:29:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Rashmika Mandanna Vijay Deverakonda On Trolling: వెండితెరపై హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా విరోష్ దంపతులు ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహబంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాల తర్వాత దాదాపు ఏడేళ్ల విరామం అనంతరం వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'రణబాలి'.

నా ఆప్యాయతను ఓవరాక్టింగ్, క్రింజ్ అనుకోండి: రష్మిక మందన్నా కామెంట్స్- నకిలీ ఖాతాలా కుట్ర ఉందన్న విజయ్ దేవరకొండ
నా ఆప్యాయతను ఓవరాక్టింగ్, క్రింజ్ అనుకోండి: రష్మిక మందన్నా కామెంట్స్- నకిలీ ఖాతాలా కుట్ర ఉందన్న విజయ్ దేవరకొండ

ఓవరాక్టింగ్, క్రింజ్ ట్రోల్స్

ప్రస్తుతం రణబాలి సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ జంట ఇంటర్వ్యూలలో తమ వ్యక్తిగత జీవితం, సోషల్ మీడియా నెగెటివిటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూట్యూబర్ కీర్తిక గోవిందసామితో జరిగిన ముఖాముఖిలో రష్మిక మాట్లాడుతూ, తన ఆప్యాయతను కొందరు 'ఓవరాక్టింగ్', 'క్రింజ్' అని ట్రోల్ చేయడంపై స్పందించారు.

మంచితనం బలహీనత కాదు.. నా తీరు మారదు!

"నా దృష్టిలో మంచితనంతో ఉండటం బలహీనత ఎంతమాత్రం కాదు. మన చుట్టూ ప్రతికూల ఆలోచనలు చాలా ఎక్కువైపోయాయి. ఇలాంటి సమయంలో నాలుగు మంచి మాటలు మాట్లాడి, కొద్దిగా పాజిటివిటీని పంచడానికే నేను మొగ్గు చూపుతాను. నా ప్రవర్తనను కొందరు ఓవరాక్టింగ్ అని విమర్శించినా నేను పట్టించుకోను. అందరికీ అందరూ నచ్చాలనే నిబంధన ఏమీ లేదు కదా!" అని రష్మిక మందన్నా చెప్పుకొచ్చారు.

ముసుగు వేసుకోవడం చేతకాదు

ఇతరులను మెప్పించడానికి ముసుగు వేసుకోవడం తనకు చేతకాదని ఆమె తేల్చి చెప్పారు. "నేను ఎలా ఉంటానో నా కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు తెలుసు. వారి సంతోషమే నాకు ముఖ్యం. ఎవరికోసమో నా అసలు వ్యక్తిత్వాన్ని మార్చుకోలేను. నేను నాలా ఉండటంలోనే నాకు నిజమైన ఆనందం లభిస్తుంది" అని రష్మిక మందన్నా పేర్కొన్నారు.

ట్రోలింగ్ అంతా కుట్రపూరితం: విజయ్ దేవరకొండ

రష్మిక మందన్నా వ్యాఖ్యలకు తోడుగా విజయ్ దేవరకొండ కూడా సోషల్ మీడియా నెగెటివిటీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సినీ తారలు, రాజకీయ నాయకులపై జరిగే ట్రోలింగ్‌లో చాలా భాగం పక్కా ప్రణాళికతో జరిగే ప్రచారం అని ఆయన వ్యాఖ్యానించారు.

నెగెటివిటీ కోసం వ్యవస్థలను నడుపుతున్నారు

"ఒక వ్యక్తిని నేరుగా కలవకుండా, వారితో సమయం గడపకుండా వారి వ్యక్తిత్వంపై అంత కచ్చితమైన అభిప్రాయానికి ఎలా రాగలరు? నేటి డిజిటల్ యుగంలో 15 నకిలీ ఖాతాలు తెరవడం పెద్ద కష్టమేమీ కాదు. ఒకరిపై నెగెటివ్ అభిప్రాయాన్ని రుద్దడానికి కొందరు వ్యవస్థలను నడుపుతున్నారు" అని విజయ్ దేవరకొండ విశ్లేషించారు.

నిజమైన ప్రవర్తనను మార్చుకోవాల్సన అవసరం లేదు

ఇలాంటి నెగెటివ్ నరేటివ్స్ చూసి ఎవరూ తమ నిజమైన ప్రవర్తనను మార్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రణబాలి' చిత్రం 19వ శతాబ్దపు దక్షిణాది నేపథ్యంతో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా.

ఏడేళ్ల తర్వాత 'రణబాలి'తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు..

ఆంగ్లేయుల పాలనలో వచ్చిన కరువు, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ఒక వీరుడి కథగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More