విశాఖపట్నంలోని పాఠశాల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి(APPCB) ఒక మంచి అవకాశాన్ని కల్పించింది. జూన్ 5న జరగబోయే 'ప్రపంచ పర్యావరణ దినోత్సవం' (World Environment Day) పురస్కరించుకుని, ఒక రోజు ముందుగానే అంటే జూన్ 4వ తేదీన విద్యార్థుల కోసం ప్రత్యేక పోటీలను నిర్వహించనున్నట్లు బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని “ప్రకృతి స్ఫూర్తితో.. వాతావరణం కోసం.. మన భవిష్యత్తు కోసం” (Inspired by Nature. For Climate. For Our Future) అనే ప్రత్యేక నినాదంతో నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా నిర్మూలించడం, పర్యావరణ హితమైన స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు.
మాధవధార హౌసింగ్ బోర్డు కాలనీలోని ఏపీపీసీబీ ప్రాంతీయ కార్యాలయంలో జూన్ 4వ తేదీ ఉదయం 9 గంటల నుండి ఈ పోటీలు ప్రారంభమవుతాయి. విద్యార్థుల వయసు ఆధారంగా రెండు విభాగాలుగా పోటీలను నిర్వహిస్తున్నారు. జూనియర్ విభాగం 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉంటుంది. సీనియర్ విభాగంలో 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు పోటీలకు హాజరుకావొచ్చు. వక్తృత్వం (Elocution), వ్యాస రచన (Essay Writing), డ్రాయింగ్ / చిత్రలేఖనం (Drawing), క్విజ్ (Quiz) పోటీలు నిర్వహిస్తారు.
ఈ ఏడాది పోటీలలో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యమయ్యేలా ఒక ప్రత్యేకమైన క్రియేటివ్ ఈవెంట్‌ను కూడా ప్లాన్ చేశారు. ఇది తల్లిదండ్రులు, పిల్లల మధ్య పర్యావరణ స్పృహను పెంపొందించడానికి సహాయపడుతుంది. ఈ పోటీలు పూర్తిగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలపైనే ఉంటాయి. ముఖ్యంగా: సర్క్యులర్ ఎకానమీ (వ్యర్థాల పునరుత్పత్తి ఆర్థిక వ్యవస్థ), ప్లాస్టిక్ కాలుష్యం - నిర్మూలన చర్యలు, పర్యావరణ అవగాహన, సుస్థిర జీవన విధానంపై ఉంటుంది.
ఈ పోటీలలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు ముందస్తుగా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ లేదా ఇతర వివరాల కోసం పేర్కొన్న ఫోన్ నంబర్లలో అధికారులను సంప్రదించవచ్చు: 99086 67273, 98851 35582, 77801 64110 కాల్ చేయండి.
{{/usCountry}}ఈ పోటీలలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు ముందస్తుగా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ లేదా ఇతర వివరాల కోసం పేర్కొన్న ఫోన్ నంబర్లలో అధికారులను సంప్రదించవచ్చు: 99086 67273, 98851 35582, 77801 64110 కాల్ చేయండి.
{{/usCountry}}పోటీలలో పాల్గొనే విద్యార్థులు డ్రాయింగ్‌కు సంబంధించిన కలర్స్, ప్యాడ్స్ వంటి మెటీరియల్‌ను స్వయంగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. విజేతలకు జూన్ 5న జరిగే ప్రధాన పర్యావరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా పర్యావరణ శాఖ ఉన్నతాధికారుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేస్తారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకోవడంతో పాటు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి వైజాగ్ విద్యార్థులకు ఇది ఒక చక్కని వేదిక.