విద్యార్థులకు అలర్ట్.. నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ అప్డేట్.. చివరి తేదీ ఇది!

ఏపీలోని విద్యార్థులకు ప్రభుత్వం ఆధార్ అప్డేట్ చేసుకునే అవకాశాన్ని పాఠశాలల్లోనే కల్పించింది. నవంబర్ 17 నుంచి నవంబర్ 26 వరకు విద్యార్థులు ఈ క్యాంపులను ఉపయోగించుకోవచ్చు.

Published on: Nov 17, 2025 10:49 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు మెుదలయ్యాయి. దీని ద్వారా విద్యార్థులు ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ సెంటర్లలో గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన పని లేకుండా.. స్కూళ్లలో అప్డేట్ చేయవచ్చు. నవంబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 26వ తేదీ వరకు పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఉంటాయి. విద్యాశాఖ, యూఐడీఏఐ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

ప్రత్యేక ఆధార్ క్యాంపులు
ప్రత్యేక ఆధార్ క్యాంపులు

దీనిపై గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే లేఖ రాశారు. ఈ క్యాంపుల ద్వారా విద్యార్థులు ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవడంతోపాటుగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోవచ్చు. బయోమెట్రిక్ అప్‌డేట్ పూర్తిగా ఉచితంగా అందిస్తారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.

అనేక మంది పిల్లల ఆధార్ అప్డేట్ కావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. సుమారు 15 లక్షల మందికిపైగా పిల్లల ఆధార్ అప్డేట్ కాలేదంటున్నారు. వారందరూ తమ ఆధార్ కార్డును అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా ప్రభుత్వం నేరుగా పాఠశాలల్లోనే ఆధార్ కార్డు అప్డేట్ కోసం క్యాంపులను ఏర్పాటు చేసింది. పిల్లలు వేరే దగ్గరకు వెళ్లకుండా నేరుగా క్యాంపుల్లోనే బయోమెట్రిక్‌లాంటివి అప్డేట్ చేయవచ్చు.

5 నుంచి 15 ఏళ్లలోపు పిల్లలు తమ బయోమెట్రిక్, ఇతర వివరాలను ఈ క్యాంపుల ద్వారా అప్డేట్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆధార్ అప్డేట్ ఉచితమని, ఎలాంటి ఫీజు చెల్లించనక్కర్లేదని అధికారులు చెబుతున్నారు. ఫింగర్ ప్రింట్, ఐరిస్ అప్డేట్ చేసుకోవచ్చని తెలిపారు.

ప్రస్తుతం ఆధార్ కార్డులో ఉన్న పేరులో ఏమైనా తప్పులు ఉంటే దానిని సరిచేసుకోవచ్చు. ఇందుకోసం బర్త్ సర్టిఫికెట్ ప్రూఫ్‌గా చూపించాలి. లేదంటే స్కూల్ రికార్డుల్లో ఎలా ఉందో అలా పేరును సరిచేసుకోవచ్చు. అడ్రస్‌లో ఏమైనా మార్పులు ఉంటే దాన్ని అప్‌డేట్ చేయవచ్చు. ఇందుకోసం అవసరమైన డాక్యుమెంట్లను ఆందజేయాలి. పుట్టిన తేదీని అప్డేట్ చేసుకోవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More