...
...
Next Story

ఈ పార్లమెంటు సమావేశాల్లో అమరావతి బిల్లు.. ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం

ఈ పార్లమెంటు సమావేశాల్లోనే అమరావతి బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుందని సీఎం చంద్రబాబు అన్నారు. దీనికి సంబంధించి కేంద్రమంత్రులు, అధికారులతో ఎప్పటికప్పుడు ఎంపీలు మాట్లాడుతూ ఉండాలన్నారు.

Published on: Jan 26, 2026, 09:24:00 IST
Advertisement

తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ(టీడీపీపీ) సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును జనవరి 28న ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనుందని వెల్లడించారు.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

కేంద్రం నుంచి అదనపు నిధులను సమీకరించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అలాగే తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి అవకాశాలు, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాలు, రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీల మంజూరు, పూర్వోదయ పథకం, పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత తీసుకుని ప్రస్తావించాలని సూచించారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలను సమర్పించామని, కేంద్రం నుంచి ఇంకా రూ.12,000 కోట్లు రావాల్సి ఉందని చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేసిన సాగునీటి ప్రాజెక్టుల విషయమై, ఎంపీలు వివాదాలకు తావివ్వకుండా, కేంద్రం అవసరమైన అనుమతులు ఇచ్చేలా సమర్థవంతమైన వాదనలు వినిపించాలని తెలిపారు.

కాళేశ్వరం, మంజీరా నీటి మళ్లింపు ప్రాజెక్టుల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో ఘర్షణ పడలేదనే విషయాన్ని హైలైట్ చేయాలని చెప్పారు. కేంద్ర పథకాలపై దృష్టి పెట్టాలని ఎంపీలకు సూచించారు చంద్రబాబు.

రాజకీయాల విషయానికొస్తే.. బీజేపీ, జనసేన పార్టీతో పొత్తుకు, ఉమ్మడి లక్ష్యాల సాధనకు నష్టం కలిగించే విధంగా ఎంపీలు ప్రవర్తించకూడదని చంద్రబాబు నాయుడు సూచనలు చేశారు.

అనంతరం మీడియా ప్రతినిధులతో లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ.. 2019-24 మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సృష్టించిన గందరగోళానికి ముగింపు పలకడమే ‘అమరావతి బిల్లు’ లక్ష్యమన్నారు. గెజిట్ నోటిఫికేషన్ జారీకి వీలు కల్పించడం ద్వారా ఏర్పాటు చేస్తున్న సంస్థలకు, చేసిన పెట్టుబడులకు హామీ ఉంటుందని తెలిపారు.

అమరావతిని అధికారికంగా ప్రకటించడానికి సంబంధించిన అన్ని సంబంధిత సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలకు, నీతి ఆయోగ్‌కు సమర్పించిందని శ్రీ కృష్ణ దేవరాయలు పేర్కొన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe