ఇంకా విషం చిమ్ముతున్నారు.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి ఆగదు - సీఎం చంద్రబాబు

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి అభివృద్ధి ఆగదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత పాలనలో అమరావతిపై మూడు ముక్కలాట ఆడారని… ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి క్రెడిట్ చోరీ చేశామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచం మెచ్చే రాజధానిగా అమరావతిని తయారుచేస్తామని పునరుద్ఘాటించారు.

Published on: Jan 25, 2026 7:54 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చెడ్డ వ్యక్తులను ప్రోత్సహిస్తే సమాజానికి హాని జరుగుతుందని, స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటేనే భవిష్యత్ బాగుంటుందని చంద్రబాబు అన్నారు. శనివారం చిత్తూరు జిల్లా నగరిలో స్వర్ణాంధ్ర –స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వ్యర్ధాల సేకరణ కోసం ఉద్దేశించిన స్వచ్ఛ రథాలను ప్రారంభించారు.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

అనంతరం ప్రజా వేదిక సభలో పాల్గొని సీఎం చంద్రబాబు ప్రసంగించారు. " నగరిలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఏడాది క్రితం ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ప్రారంభించాం. స్వచ్ఛాంధ్ర అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు...ఇది మన జీవన విధానం కావాలి. అందుకే ప్రతి నెలా 3వ శనివారం నాతో సహా నేతలు, అధికార యంత్రాంగం హాజరవుతున్నాము" అని తెలిపారు.

“స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.0లో భాగంగా సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కింద 101 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులను రూ.510 కోట్లతో చేపడుతున్నాం. రూ.2.21 కోట్ల విలువైన 9,048 హోం కంపోస్టింగ్ బిన్స్ హౌస్ హోల్డ్ వేస్ట్ ప్రాసెసింగ్ కోసం మెప్మా ఆర్పీలకు సమకూర్చడం జరిగింది. గ్రామాల్లో ఇంటింటికీ చెత్త సేకరణ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ 2.0 కింద రూ.6.7 కోట్లతో 200 e-ఆటోలు, 12,000 ట్రైసైకిళ్లు, 5,000 పుష్‌కార్ట్స్ సిద్ధం చేశాం. గతేడాది నుంచి స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద విస్తృతంగా పరిశుభ్రతా డ్రైవ్‌లు చేపట్టాం”అని వివరించారు.

“వచ్చే నెలలో కర్నూలు, రాజమండ్రి, కడప, నెల్లూరులో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను పీపీపీ మోడల్‌లో చేపడుతున్నాం. రెండేళ్లలో ఇవి ఉత్పత్తి మొదలు పెడతాయి. విజయవాడ, తిరుపతికి కూడా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవి కార్యరూపం దాల్చితే ప్రజలకు డంపింగ్ యార్డ్ సమస్య ఉండదు. కాలుష్యం కూడా తగ్గుతుంది”అని చెప్పారు.

అమరావతి ఆగదు - సీఎం చంద్రబాబు

గత ఐదేళ్లలో రాష్ట్రం అతలాకుతలమైందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. “ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేశారు. నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లాం. 94 శాతం స్టైక్ రేటుతో విజయం సాధించాం. గత పాలనలో అమరావతిపై మూడు ముక్కలాట ఆడారు. స్మశానం, ఎడారి అన్నారు. ఇప్పుడూ ప్రెస్ మీట్లు పెట్టి క్రెడిట్ చోరీ చేశామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. రాజధానిపై ఇంకా విషం చిమ్ముతున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి ఆగదు. ఆనాడు సైబరాబాద్ నగరాన్ని నిర్మించాను. నేడు అమరావతి నగరాన్ని నిర్మించే అవకాశం ప్రజలు ఇచ్చారు”అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.

“గత ప్రభుత్వం ఇరిగేషన్ వ్యవస్థను సర్వ నాశనం చేసింది. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. సీమను రాళ్ల సీమగా మార్చారు. గత ప్రభుత్వంలో కేంద్ర నిధులను పక్కదారి పట్టించారు. కేంద్ర పథకాలను నిర్వీర్యం చేశారు. జల జీవన్ మిషన్ లో రూ. లక్ష కోట్లు వాడుకునే అవకాశం ఉన్నా అసమర్థతతో వదిలేశారు. తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసిన వారిని ఏం చేయాలి? పోలవరం డయాఫ్రమ్ వాల్ ను గోదావరిలో కలిపేశారు. 2027 నాటికి పోలవరం పూర్తిచేస్తాం. గోదావరి జలాలు సీమకు వస్తే నీటి సమస్య ఉండదు”అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.