అంతా సిద్ధం.. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే రాజధాని అమరావతి బిల్లు
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి త్వరలో చట్టబద్ధత రానుంది. ఈ మేరకు కేంద్రం పార్లమెంటు సమావేశాల్లో పూర్తి చేయాలని అనుకుంటోంది.
అమరావతికి రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి మార్గం సుగమం చేసింది కేంద్రం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఇతర సంబంధిత కేంద్ర విభాగాలు కోరిన అవసరమైన వివరాలు, స్పష్టతలను సమర్పించినట్టుగా తెలుస్తోంది. ఈ సంబంధిత బిల్లును పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం చూస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక పార్లమెంటు సభ్యుడి ప్రకారం.. జనవరి 28న ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ముగింపు నాటికి ఈ ప్రతిపాదిత చట్టం ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.
ఈ బిల్లు 2014 నాటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణ చేయడానికి ఉద్దేశించబడింది. ఆ చట్టంలో హైదరాబాద్ పదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా పేర్కొన్నారు. ఈ గడువు జూన్ 2, 2024న ముగిసింది. ఈ నేపథ్యంలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అధికారికంగా ప్రకటించడం అవసరమైంది.
రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం అమరావతికి చట్టపరమైన రక్షణ కల్పించాలని కేంద్రాన్ని కోరింది. హోం, న్యాయ మంత్రిత్వ శాఖలకు అవసరమైన సమాచారాన్ని అందించడం ద్వారా ఈ ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియ దాదాపు పూర్తయింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేయడం, నిర్మాణాల పురోగతికి సంబంధించిన వాస్తవాలతో కూడిన ఒక నివేదికను సిద్ధం చేసి, బిల్లును ముందుకు తీసుకెళ్లడానికి వీలుగా కేంద్రానికి పంపింది. జూన్ 2, 2024 నుండి అమరావతిని రాజధానిగా ప్రకటించాలని కూడా కోరింది.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టపరమైన బలాన్ని చేకూర్చడానికి, తద్వారా కేంద్ర చట్టం కింద దానికి రక్షణ లభించేలా చేయడానికి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)ను సవరించాల్సిన అవసరం ఉందని సంకీర్ణ ప్రభుత్వం భావించింది.
అధికారంలోకి వచ్చిన వెంటనే, టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమి అమరావతి శాశ్వత రాజధానిగా ఉండేలా, భవిష్యత్తులో ఎవరూ దానిని మార్చకుండా ఉండేలా పార్లమెంటు ఆమోదం పొందాలని సంకల్పించాయి. నిజానికి 2016 నుంచి రాజధానిగా అమరావతి కేంద్రంగా ఏపీ ప్రభుత్వం పాలన ప్రారంభించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మూడు రాజధానులు అంశాన్ని ఎత్తుకున్నారు. దీనిపై టీడీపీ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసింది. తర్వాత అధికారంలోకి వచ్చింది. వీలైనంత త్వరగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని చూస్తోంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


