AP Amaravati Championship 2.0 : ఆంధ్రప్రదేశ్‌ను క్రీడల పరంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలనే బలమైన సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక అడుగు వేసింది. గ్రామీణస పట్టణ ప్రాంతాల్లో దాగున్న క్రీడా నైపుణ్యాలను గుర్తించి, వారిని అంతర్జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో జూలై 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా "అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0" మహా క్రీడా పోటీలను ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో ఈ ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగనుంది. క్షేత్రస్థాయి నుంచి ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను గుర్తించి, వారికి సరైన వేదికను కల్పించడమే ఈ ఛాంపియన్‌షిప్ ప్రధాన ఉద్దేశం.
3 దశల్లో పోటీలు.. క్రీడల పూర్తి షెడ్యూల్ ఇదే!
- జూలై 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది.
- ప్రాథమిక ఎంపికల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఆగస్టు 1 నుంచి ఆగస్టు 15 వరకు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తారు.
- చివరగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు ఆగస్టు 20 నుంచి ఆగస్టు 25 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయి.
- జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 29న విజేతలకు ఘనంగా బహుమతులను అందజేస్తారు.
ఈ ఛాంపియన్‌షిప్‌లో అండర్-17 (17 ఏళ్ల లోపు), అండర్-23 (23 ఏళ్ల లోపు) విభాగాల్లో మొత్తం 12 రకాల క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఏకంగా రూ.94 లక్షల భారీ నగదు బహుమతులను కేటాయించింది. ఈ పోటీల ద్వారా దాదాపు 3 లక్షల మందికి పైగా విద్యార్థులు, యువతను భాగస్వామ్యం చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
"అండర్-17, అండర్-23 విభాగాల ద్వారా మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు కొత్త ప్రతిభను వెలికితీస్తాం. ఆంధ్రప్రదేశ్‌ను 'క్రీడా ఆంధ్రప్రదేశ్'గా మార్చడమే మా సంకల్పం" అని శాప్ (SAAP) చైర్మన్ రవి నాయుడు స్పష్టం చేశారు.
{{/usCountry}}"అండర్-17, అండర్-23 విభాగాల ద్వారా మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు కొత్త ప్రతిభను వెలికితీస్తాం. ఆంధ్రప్రదేశ్‌ను 'క్రీడా ఆంధ్రప్రదేశ్'గా మార్చడమే మా సంకల్పం" అని శాప్ (SAAP) చైర్మన్ రవి నాయుడు స్పష్టం చేశారు.
{{/usCountry}}"క్రీడాకారులు పతకాలు సాధించిన తర్వాతే కాదు... వాటిని సాధించేందుకు వారు పడే కష్టంలో, శిక్షణ సమయంలోనే వారికి అండగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిశ్చయించారు. కామన్‌వెల్త్, ఆసియా క్రీడలకు ఎంపికైన క్రీడాకారులను మా ప్రభుత్వం ముందుగానే ప్రోత్సహిస్తోంది" అని శాప్ చైర్మన్ వివరించారు.
క్రీడాకారుల అభివృద్ధి కేవలం ప్రభుత్వంతోనే ముడిపడి ఉండకుండా, స్థానిక పారిశ్రామికవేత్తలు, దాతల సహకారాన్ని కూడా జోడించి మరింత మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ అమరావతి ఛాంపియన్‌షిప్ విజయవంతానికి మీడియా సైతం తమ వంతు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, క్రీడాకారులతో పాటు క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమించే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ (DSDOలు), క్రీడా శిక్షకులను (కోచ్‌లు) సైతం రాష్ట్ర స్థాయిలో సన్మానించి వారి సేవలను గుర్తించనున్నారు.