...
...
Next Story

Vijayawada : దశాబ్దాల ఇళ్ల పట్టాల సమస్యకు పరిష్కారం - ఈనెల 30న పట్టాల పంపిణీ

విజయవాడలో దశాబ్దాలుగా నలుగుతున్న ఇళ్ల పట్టాల సమస్యకు ఏపీ ప్రభుత్వం ముగింపు పలకనుంది. 'పేదలకు పట్టాభిషేకం' కింద సెప్టెంబర్ 30న సీఎం చంద్రబాబు 24,057 కుటుంబాలకు ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాలను పంపిణీ చేయనున్నారు.

Published on: Sep 27, 2026, 06:02:58 IST
Advertisement

విజయవాడ నగరంతో పాటు పరిసర ప్రాంత ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.విజయవాడ నగరంలో ఎన్టీఆర్ హయాం నుంచి పెండింగ్‌లో ఉన్న ఇళ్ల పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ…. సెప్టెంబర్ 30న లబ్ధిదారులకు క్రమబద్ధీకరణ పట్టాలను పంపిణీ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముహూర్తం ఖరారు చేశారు.

సంపూర్ణ హక్కులు….

ఇళ్ల క్రమబద్దీకరణ పట్టాలు
ఇళ్ల క్రమబద్దీకరణ పట్టాలు

'పేదలకు పట్టాభిషేకం' పేరిట చేపట్టే ఈ భారీ కార్యక్రమంలో 24,057 కుటుంబాలకు పూర్తి స్థాయి యాజమాన్య హక్కులను కల్పించనున్నారు.రూ.9,800 కోట్ల విలువైన భూములకు విముక్తిఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ ద్వారా సుమారు రూ.9,800 కోట్ల విలువైన భూమిపై పేదలకు సంపూర్ణ హక్కులు లభిస్తాయని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది.

బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం చూస్తే…. ఈ స్థలాల విలువ దాదాపు రూ.24,297 కోట్లు ఉంటుందని అంచనా. ఈ నిర్ణయం వల్ల ఒక్కో లబ్ధిదారు కుటుంబానికి సుమారు రూ.40 లక్షల నుంచి రూ.45 లక్షల విలువైన ఆస్తిపై చట్టబద్ధమైన శాశ్వత హక్కులు దక్కుతాయి. విశాఖపట్నంలో విజయవంతంగా నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ తరహాలోనే, ఇప్పుడు విజయవాడలోనూ ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోంది.

మొత్తం 617 ఎకరాల విస్తీర్ణం.. 30 లక్షల చదరపు గజాలుగతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేటాయించిన స్థలాలు, కొండ ప్రాంతాల్లోని ఇళ్లకు సంబంధించిన స్థలాలను ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా రెగ్యులరైజ్ చేస్తోంది. మొత్తం 617 ఎకరాల విస్తీర్ణంలోని (సుమారు 30 లక్షల చదరపు గజాలు) నివాస ప్రాంతాలకు సంబంధించి ఈ హక్కు పత్రాలను అందజేస్తారు.

తమ నివాసాలకు చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు కల్పిస్తేనే తమ ఇళ్లకు భద్రత ఉంటుందని, భవిష్యత్తుకు భరోసా దక్కుతుందని కొండ ప్రాంత వాసులు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఇటీవల జరిగిన జిల్లా స్థాయి ప్రజాప్రతినిధుల సమీక్షా సమావేశంలోనూ ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించిన అనంతరమే ప్రభుత్వం వేగంగా అడుగులు వేసింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks