Organic Plaza : విశాఖపట్నంలో ఆర్గానిక్ ప్లాజా.. ప్లాన్ చేస్తున్న వీఎంఆర్‌డీఏ
Visakhapatnam Organic Plaza : విశాఖపట్నంలో ఆర్గానిక్ ప్లాజాను ఏర్పాటు చేయాలని వీఎంఆర్‌డీఏ యోచిస్తోంది. దీనిద్వారా సేంద్రియ ఉత్పత్తులకు, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయనుంది.
విశాఖ మద్దిలపాలెంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోని ఎ-హబ్‌లో నిర్వహించిన సేంద్రియ రైతుల మేళాలో విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్ భరత్ పాల్గొని మాట్లాడారు. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, సేంద్రియ ఉత్పత్తులకు ప్రత్యేక మార్కెట్‌ను అందించడానికి విశాఖపట్నం నగరంలో ఒక ఆర్గానిక్ ప్లాజాను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

ప్రతిపాదిత ఆర్గానిక్ ప్లాజా వల్ల రైతులు, వినియోగదారులు, పర్యాటకులు అందరికీ ప్రయోజనం చేకూరుతుందని తేజ్ భరత్ అన్నారు. అంతకుముందు తేజ్ భరత్ రైతులు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి, పంట దిగుబడులు, మార్కెటింగ్, వారు ఎదుర్కొంటున్న సవాళ్లపై వారితో ముచ్చటించారు. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ అవర్ వెజిటబుల్ గార్డెన్ కార్యక్రమం కింద వంకాయ, దేశీ బంతి, టమాటా, గుంటూరు పచ్చిమిర్చి మొక్కలను కూడా పంపిణీ చేశారు.
మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని భరత్ నొక్కి చెప్పారు. ప్రకృతి ఆధారిత సాగు పద్ధతులను అవలంబించే రైతులకు తగిన ప్రోత్సాహకాల ద్వారా మద్దతు ఇవ్వాలని ఆయన అన్నారు. సహజసిద్ధంగా పండించిన పంటలతో ఉత్పత్తులను తయారు చేయాలని స్వయం సహాయక బృందాలను ఆయన కోరారు. అలాగే ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గోవుల ఆధారిత సహజ రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు దట్ల సుబ్రహ్మణ్య వర్మ, రైతులు రిషి, త్రినాథ్, జగదీష్, రాజు, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జె.వి. రత్నం, కోఆర్డినేటర్లు భాస్కర్, జె. రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


