ఏపీ : మరింత ఈజీగా 'ధాన్యం కొనుగోళ్లు' - ఈ నెంబర్ కు 'హాయ్' అని పెడితే చాలు..!

ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ధాన్యం కొనుగోలు సేవలను వాట్సాప్ ద్వారా పొందే వీలు కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వివరాలను వెల్లడించారు.

Published on: Nov 20, 2025, 15:17:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలోని రైతులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు పడే తిప్పలకు ఉపశమనం కలిగించేలా సరికొత్త సేవలను తీసుకొచ్చింది. ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేసుకునేలా… రైతుల సమయం వృథా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలను ప్రవేశపెట్టింది. ఈ సేవలను రైతులు వినియోగించుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ధాన్యం కొనుగోలుకు వాట్సాప్ సేవలు
ధాన్యం కొనుగోలుకు వాట్సాప్ సేవలు

ధాన్యం సేకరణ ప్రక్రియను సరళీకృతం చేయడానికి మరియు రైతులు ఇకపై సేకరణ కేంద్రాల వద్ద వేచి ఉండకుండా ఈ వాట్సాప్ సేవలను ప్రవేశపెట్టినట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు. వాట్సాప్ ఆధారంగా స్లాట్లు బుకింగ్ చేసుకోవచ్చని సూచించారు.

స్లాట్ బుకింగ్ ఇలా…

ధాన్యం కొనుగోలుకు వాట్సాప్ ఆధారంగా స్లాట్ బుకింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి రైతులు 7337359375 కు "హాయ్" అనే సందేశం పంపాలి. వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా ప్రత్యేక వాయిస్‌తో సేవల వినియోగంపై మార్గదర్శకం చేస్తుంది. ఆధార్ నంబర్ నమోదు చేయడంతో వారి పేరును ధృవీకరిస్తుంది. ధాన్యం సేకరణ కేంద్రాన్ని ఎంచుకోవడంతో పాటు అందుబాటులో ఉన్న తేదీలను కూడా డిస్ ప్లే చేస్తుంది.

రైతులు తాము విక్రయించాలనుకుంటున్న వరి రకాన్ని కూడా ఎంచుకోవచ్చు. సంచుల సంఖ్యను పేర్కొనొచ్చు. బుకింగ్ పూర్తయిన తర్వాత కూపన్ కోడ్ జారీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు.

ఈ వ్యవస్థ ద్వారా రైతులు తాము ఎంచుకున్న తేదీ మరియు సమయంలో ఆలస్యం చేయకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించటానికి వీలు కల్పిస్తుందని మంత్రి మనోహర్ తెలిపారు. సేకరణ కేంద్రాల వద్ద భారీ క్యూలైన్లు లేకుండా చేయటంతో పాటు సమర్థవంతంగా ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తి చేయటమే ఈ సేవల లక్ష్యమని ప్రభుత్ అధికారులు చెబుతున్నారు.

  • ధాన్యం కొనుగోలు చేసే రైతులు ముందుగా '7337359375 కు "హాయ్" అనే సందేశం పంపాలి.
  • రైతులు మొదట తమ ఆధార్ నెంబర్ నమోదు చేసేకోవాలి.
  • ఆ తర్వాత రైతు పేరును ధృవీకరించాల్సి ఉంటుంది. తర్వాత ధాన్యం అమ్మదలచిన కొనుగోలు కేంద్రం పేరును ఎంచుకోవాలి.
  • ఏ రోజు అమ్మాలనుకుంటున్నారో.. ఆ తేదీకి సంబంధించి మూడు ఆప్షన్లు ఇస్తారు. దానిలో ఏదో ఒక తేదీని నిర్ణయించుకోవాలి. అనంతరం సమయాన్ని కూడా ఎంచుకోవాలి.
  • రైతు ఎలాంటి రకం ధాన్యం, ఎన్ని బస్తాల రూపంలో అమ్ముతున్నారు అన్నది అక్కడ నమోదు చేయాలి. ఆ తర్వాత స్లాట్ బుక్ అయినట్లు షెడ్యూల్ చేయబడిన ఓ కూపన్ కోడ్ వస్తుంది.
  • చివరగా రైతులు సులభంగా తమ ధాన్యం అమ్మకం తేదీ, సమయాన్ని బట్టి తాను ఎంచుకున్న కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి సులభంగా ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్ముకునేందుకు వీలవుతుంది.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More