ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ కార్యదర్శులకు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. జీవో నెంబర్ 91 సవరణతో పంచాయతీ కార్యదర్శులకు పేస్కేల్ తగ్గించింది. పంచాయతీ కార్యదర్శుల జీతం విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చ అవుతోంది.

గతంలో గ్రేడ్ 5 నుంచి గ్రేడ్ 3 హోదాకు అప్‌గ్రేడ్ చేస్తూ.. జారీ చేసిన జీవో 91 ప్రకారం వీరికి రూ.28,290 పేస్కేల్ నిర్ణయించారు. అయితే కూటమి ప్రభుత్వం ఆ ఉత్తర్వులను సవరిస్తూ.. జీవో 60ని విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పంచాయతీ కార్యదర్శుల పేస్కేల్‌ను రూ.28,280 నుంచి రూ.25,220కి తగ్గించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన G.O.MS.No. 60 ఉత్తర్వుల ప్రకారం, గ్రామ పంచాయతీ కార్యదర్శుల గ్రేడ్ల పునర్విభజన, వేతన సవరణలో భాగంగా గ్రేడ్-III కార్యదర్శుల వేతన శ్రేణిని సవరించడం జరిగింది. గతంలో G.O.Rt.No. 91లో పేర్కొన్న రూ. 28,280 - 89,720 వేతన శ్రేణిని ఇప్పుడు రూ. 25,220 - 80,910 గా సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మార్పులకు అనుగుణంగా తక్షణమే తదుపరి చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ కమిషనర్‌ను ఆదేశించింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పంచాయతీ కార్యదర్శులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతులు కల్పించినట్టే కల్పించి.. వేతనం వచ్చేసరికి కోత విధించడం దారుణం అని వాపోతున్నారు. కిందటి ప్రభుత్వ హయాంలో వచ్చిన ప్రయోజనాలను రద్దు చేయడం వలనే వేలాది మంది ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోందన్నారు.
తక్షణమే సవరించిన జీవో 60ని ఉపసంహరించుకోవాలని, పాత పేస్కేల్‌నే కొనసాగించాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ల మీద ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే.. నిరసనలు వ్యక్తం చేస్తామని చెప్పారు.
పదోన్నతులు కల్పించి, తీరా వేతనం వచ్చేసరికి కోత విధించడం అన్యాయమని, ఇది తమ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందని కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వచ్చిన ప్రయోజనాలను రద్దు చేయడం వల్ల వేలాది మంది ఉద్యోగులు ఆర్థికంగా దెబ్బతింటారని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు.
{{/usCountry}}పదోన్నతులు కల్పించి, తీరా వేతనం వచ్చేసరికి కోత విధించడం అన్యాయమని, ఇది తమ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందని కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వచ్చిన ప్రయోజనాలను రద్దు చేయడం వల్ల వేలాది మంది ఉద్యోగులు ఆర్థికంగా దెబ్బతింటారని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు.
{{/usCountry}}