Panchayat Secretaries : పంచాయతీ కార్యదర్శులకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం.. పేస్కేల్ భారీగా తగ్గింపు!

Panchayat Secretaries : ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పేస్కేల్ భారీగా తగ్గించింది.

Published on: Apr 6, 2026, 20:20:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ కార్యదర్శులకు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. జీవో నెంబర్ 91 సవరణతో పంచాయతీ కార్యదర్శులకు పేస్కేల్ తగ్గించింది. పంచాయతీ కార్యదర్శుల జీతం విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చ అవుతోంది.

పంచాయతీ కార్యదర్శుల పే స్కేల్
పంచాయతీ కార్యదర్శుల పే స్కేల్

గతంలో గ్రేడ్ 5 నుంచి గ్రేడ్ 3 హోదాకు అప్‌గ్రేడ్ చేస్తూ.. జారీ చేసిన జీవో 91 ప్రకారం వీరికి రూ.28,290 పేస్కేల్ నిర్ణయించారు. అయితే కూటమి ప్రభుత్వం ఆ ఉత్తర్వులను సవరిస్తూ.. జీవో 60ని విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పంచాయతీ కార్యదర్శుల పేస్కేల్‌ను రూ.28,280 నుంచి రూ.25,220కి తగ్గించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన G.O.MS.No. 60 ఉత్తర్వుల ప్రకారం, గ్రామ పంచాయతీ కార్యదర్శుల గ్రేడ్ల పునర్విభజన, వేతన సవరణలో భాగంగా గ్రేడ్-III కార్యదర్శుల వేతన శ్రేణిని సవరించడం జరిగింది. గతంలో G.O.Rt.No. 91లో పేర్కొన్న రూ. 28,280 - 89,720 వేతన శ్రేణిని ఇప్పుడు రూ. 25,220 - 80,910 గా సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మార్పులకు అనుగుణంగా తక్షణమే తదుపరి చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ కమిషనర్‌ను ఆదేశించింది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పంచాయతీ కార్యదర్శులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతులు కల్పించినట్టే కల్పించి.. వేతనం వచ్చేసరికి కోత విధించడం దారుణం అని వాపోతున్నారు. కిందటి ప్రభుత్వ హయాంలో వచ్చిన ప్రయోజనాలను రద్దు చేయడం వలనే వేలాది మంది ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోందన్నారు.

తక్షణమే సవరించిన జీవో 60ని ఉపసంహరించుకోవాలని, పాత పేస్కేల్‌నే కొనసాగించాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ల మీద ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే.. నిరసనలు వ్యక్తం చేస్తామని చెప్పారు.

పదోన్నతులు కల్పించి, తీరా వేతనం వచ్చేసరికి కోత విధించడం అన్యాయమని, ఇది తమ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందని కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వచ్చిన ప్రయోజనాలను రద్దు చేయడం వల్ల వేలాది మంది ఉద్యోగులు ఆర్థికంగా దెబ్బతింటారని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More