...
...
Next Story

విశాఖలో ' పాల్స్ గ్లోబల్ టాయ్ పార్క్‌' - ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

పాల్స్ గ్లోబల్ టాయ్ పార్క్‌ను స్థాపించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పార్క్ కోసం… మొదటి దశలో విశాఖపట్నం జిల్లా నక్కపల్లి‌లో 581.39 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

Published on: Dec 5, 2025, 11:11:40 IST
Advertisement

ప్రపంచ స్థాయి టోయ్ తయారీ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్యమైన అడుగు ముందుకు వేసింది. పాల్స్ గ్లోబల్‌తో భాగస్వామ్యంగా APIIC గ్లోబల్ టాయ్ పార్క్‌ను స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

మొదటి దశ భూకేటాయింపులు…

పాల్స్ గ్లోబల్ టాయ్ పార్క్‌ - ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ (image source @AndhraCommunity X Account)
పాల్స్ గ్లోబల్ టాయ్ పార్క్‌ - ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ (image source @AndhraCommunity X Account)

భారతదేశంలో అతిపెద్ద సమగ్ర టోయ్ ఉత్పత్తి క్లస్టర్‌లలో ఒకటిగా రూపొందనున్న ఈ పార్క్ కోసం, మొదటి దశలో విశాఖపట్నం జిల్లా నక్కపల్లి‌లో 581.39 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందుకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

“జపాన్, కొరియా, తైవాన్ వంటి దేశాల ప్రముఖ గ్లోబల్ టోయ్ పరిశ్రమ పెట్టుబడిదారులతో పాటు, పాల్స్ ప్లష్ లిమిటెడ్ అధ్యక్షుడు అజయ్ సిన్హా గారిని కలిశాను. అనకపల్లి జిల్లా, నక్కపల్లి మండలంలో పర్యావరణ అనుకూల టాయ్ పార్క్ అభివృద్ధి అంశంపై చర్చించాము. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రాంతంలోని 30,000 మందికి పైగా మహిళలకు ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయి మరియు ప్రపంచంలోని అనేక పిల్లలకు ఆనందాన్ని అందించే ఉత్పత్తులు ఇక్కడి నుంచి బయలుదేరతాయి” అని ట్వీట్ లో పేర్కొన్నారు.

పాల్స్ గ్లోబల్ టాయ్ పార్క్ అధ్యక్షుడు అజయ్ సిన్హా…. రాష్ట్ర ప్రభుత్వ ప్రో-ఆక్టివ్ దృక్పథాన్ని అభినందించారు. భారతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుండి విశేష స్పందన లభిస్తోందని, అనేక పెట్టుబడిదారులతో చర్చలు విజయవంతంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

పాల్స్ గ్లోబల్ టాయ్ పార్క్ వేలాది గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, వారి కుటుంబాల ఆర్థిక స్థితిని బలోపేతం చేసే శక్తివంతమైన ఉపాధి యంత్రంగా నిలుస్తుంది. కఠిన అమలు ప్రణాళికలతో అనుసంధానంగా, ఈ టోయ్ పార్క్‌కు సంబంధించిన సర్క్యులర్‌ను నవంబర్ 16న ఇండస్ట్రీస్ సెక్రటరీ జారీ చేశారు. దేశవ్యాప్తంగా మరియు విదేశాల నుంచి భారీ పెట్టుబడులు ఆకర్షించే ఈ ప్రాజెక్ట్… రానున్న కాలంలో రాష్ట్ర పరిశ్రమల వృద్ధికి దోహదపడనుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks