ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ రరూప్‌రేఖలను సిద్ధం చేసింది. 'విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్' (VER) ప్రాజెక్టు ద్వారా దాదాపు ₹9.3 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విఇఆర్ అభివృద్ధి ప్రణాళికపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ బృహత్తర ప్రాజెక్టు కింద రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా రూ. 3.5 లక్షల కోట్ల నుంచి రూ. 4 లక్షల కోట్ల వరకు వెచ్చించనుండగా, ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా రూ. 5.3 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది.
"మైక్రో లెవెల్ ప్లానింగ్ ద్వారా విశాఖ రీజియన్ మొత్తాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే విఇఆర్ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం" అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
'బే సిటీ' ప్రాజెక్ట్ కీలక నిలయం.. విస్తరణ పరిధి ఇదే
ఈ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి కోసం ప్రతిపాదించిన 'బే సిటీ' (Bay City)ని ప్రధాన కేంద్రంగా (Anchor) మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. బే సిటీ ప్రాజెక్టు అమలు కోసం ఒక ప్రత్యేక 'ఎగ్జిక్యూటివ్ కమిటీ'ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
విఇఆర్ పరిధిని శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు నుంచి రాజమండ్రిలోని ప్రతిపాదిత 'అఖండ గోదావరి' ప్రాజెక్టు వరకు విస్తరించాలని అధికారులకు సూచించారు. అందుబాటులో ఉన్న నిధుల వినియోగంతో పాటు అవసరమైన చోట 'వయాబిలిటీ గ్యాప్ ఫండింగ్' (VGF) కూడా ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు.
ప్రాధాన్యత రంగాలు, ఇన్ఫ్రా ప్రాజెక్టులు
కీలక రంగాలు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్లు, పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, పర్యాటకం, గ్రీన్ హైడ్రోజన్, క్లీన్ టెక్నాలజీస్, ఎనర్జీ ప్రాజెక్టులు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (GCC), ఫిన్‌టెక్, లాజిస్టిక్స్.
కనెక్టివిటీ విస్తరణ: విశాఖపట్నం, కాకినాడ ప్రాంతాలను పశ్చిమ భారతదేశంతో అనుసంధానించేలా రోడ్డు, రైలు మార్గాలను వేగవంతం చేయడం. 4 విమానాశ్రయాలు, 3 నౌకాశ్రయాలను అనుసంధానించడం ద్వారా పెట్టుబడుల వేగం పెంచడం.
{{/usCountry}}కనెక్టివిటీ విస్తరణ: విశాఖపట్నం, కాకినాడ ప్రాంతాలను పశ్చిమ భారతదేశంతో అనుసంధానించేలా రోడ్డు, రైలు మార్గాలను వేగవంతం చేయడం. 4 విమానాశ్రయాలు, 3 నౌకాశ్రయాలను అనుసంధానించడం ద్వారా పెట్టుబడుల వేగం పెంచడం.
{{/usCountry}}టూరిజం డెవలప్‌మెంట్: విశాఖ జూలాజికల్ పార్క్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం.
ప్రముఖ పెట్టుబడులు: ఇప్పటికే స్థిరపడిన గూగుల్ AI డేటా సెంటర్, ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ వంటివి రీజియన్ ఇమేజ్‌ను మరింత పెంచాయని అధికారులు తెలిపారు.