ఏపీ ప్రభుత్వం ఆదాయం సమకూర్చే కీలక శాఖల పనితీరుపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1,27,506 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించింది. ఆ దిశగా పనిచేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రం సొంతంగా ఆర్జించే ఆదాయాన్ని పెంచేందుకు అన్ని ఆదాయ మార్గాల శాఖలు కసరత్తు ముమ్మరం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.27 లక్షల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
గత రెండేళ్లలో రాష్ట్ర సొంత ఆదాయం క్రమంగా పెరుగుతూ వస్తోందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 2024-25: రూ. 1,04,345 కోట్లు, 2025-26: రూ. 1,10,643 కోట్లు (6 శాతం వృద్ధి), ప్రస్తుత ఆర్థిక సంవత్సరం: మొదటి 42 రోజుల్లోనే 38 శాతం వృద్ధి నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
కీలక శాఖల సహకారం
2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రధానంగా కొన్ని రంగాల నుండి ఆదాయం సమకూరింది. జీఎస్టీ: రూ. 33,679 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు: రూ. 11,047 కోట్లు, గనుల శాఖ: రూ. 10,300 కోట్లుగా ఉంది.
సాంకేతికతతో పన్ను ఎగవేతకు చెక్
పన్ను చెల్లింపుదారులను ఇబ్బంది పెట్టకుండానే, ఆదాయం వృథా కాకుండా చూడాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే జీఎస్‌టీ చెల్లింపుల పరిశీలనలో ఏఐ టెక్నాలజీని వాడాలని ఆదేశించారు. భూ వివాదాలను పరిష్కరించడం ద్వారా రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచవచ్చన్నారు.
వాహనం కొన్న 24 గంటల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవ్వాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పట్టణాల్లో పన్నుల వసూళ్లను క్రమబద్ధీకరించడానికి ఆధునిక పద్ధతులను వాడాలని సీఎం సూచించారు: అనధికార కట్టడాలను గుర్తించేందుకు డ్రోన్ సర్వేలు, శాటిలైట్ చిత్రాలు, జీఐఎస్ మ్యాపింగ్‌ను ఉపయోగించాలని ఆదేశించారు.
జిల్లాలు - ఆర్థిక కేంద్రాలు
జిల్లాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం వేగంగా ఆర్థిక లక్ష్యాలను చేరుకుంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఖనిజాల విలువను పెంచి ఎగుమతి చేయడం, ఎర్రచందనం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంపై కూడా దృష్టి పెట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా గనులు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖలు పనిచేయాలన్నారు.
{{/usCountry}}జిల్లాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం వేగంగా ఆర్థిక లక్ష్యాలను చేరుకుంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఖనిజాల విలువను పెంచి ఎగుమతి చేయడం, ఎర్రచందనం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంపై కూడా దృష్టి పెట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా గనులు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖలు పనిచేయాలన్నారు.
{{/usCountry}}ప్రభుత్వ ఆదాయంలో ప్రతీ రూపాయి ప్రజలకు సద్వినియోగం కావాలని చంద్రబాబు అన్నారు. ఆ దిశగా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెరగడంతో పాటు, అందుకు అనుగుణంగా పన్ను వసూళ్లు కూడా పెరగాలని, అవినీతికి తావులేకుండా పారదర్శకమైన విధానాలను అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.