ఆంధ్రప్రదేశ్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్.. సీఎం చంద్రబాబు కీలక కామెంట్స్

రాష్ట్రంలో పొదుపు చర్యలు పాటించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. నా దేశం-నా బాధ్యత పేరుతో పొదుపుపై ప్రచారం చేయాలని నిర్ణయించారు.

Published on: May 14, 2026, 20:26:32 IST
By , Amaravati
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పశ్చిమ ఆసియాలో నెలకొన్న సంఘర్షణల నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుపై ఏపీ ప్రభుత్వం చర్చించింది. దేశం కోసం పొదుపు పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పొదుపు, బాధ్యతాయుతమైన ఖర్చు, సుస్థిర జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో క్రమశిక్షణతో కూడిన ఆర్థిక అలవాట్లను అలవర్చుకోవడానికి, అనవసర ఖర్చులను నివారించడానికి ప్రజలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం త్వరలో ‘నా దేశం – నా బాధ్యత’ అనే ప్రజా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

కేవలం సంకేతాత్మక చర్యలు సహాయపడవని స్పష్టం చేస్తూ, మంత్రులు, వీఐపీల భద్రతా కాన్వాయ్‌లను తగ్గించడం ఒక ఆరంభం మాత్రమేనని నాయుడు తెలిపరు. 'ప్రజాధనాన్ని ఆదా చేయగల అనేక ఇతర రంగాలను ప్రభుత్వం గుర్తించాలి.' అని చంద్రబాబు అన్నారు. జిల్లా పర్యటనల సమయంలో ఖర్చులను తగ్గించుకోవాలని మంత్రులను ఆదేశించారు. అలాగే అవసరం లేని పక్షంలో విదేశీ పర్యటనలకు దూరంగా ఉండాలని సూచించారు.

సాంకేతికత ఆధారిత పాలన ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ, నిర్వహణ ఖర్చులను తగ్గించడానికి వర్చువల్ సమావేశాలు, డిజిటల్ పరిపాలనను విస్తృతంగా ఉపయోగించాలని చంద్రబాబు నాయుడు కోరారు. తగిన రంగాలలో వర్క్-ఫ్రమ్-హోమ్ విధానాల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. ఇందుకోసం స్టడీ చేసి కార్యాచరణ రూపొందించాలన్నారు.

ఐఏఎస్ అధికారులు ఉపయోగిస్తున్న అధికారిక వాహనాల సంఖ్య వివరాలను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కోరారు. సీఎంవోతో సహా పలు విభాగాలను నిర్వహిస్తున్న కొందరు సీనియర్ అధికారులు నాలుగు నుంచి ఐదు వాహనాలను ఉపయోగిస్తున్నారని తెలుసుకున్న ఆయన, పొదుపు సంస్కరణలలో భాగంగా ప్రతి అధికారి కేవలం ఒకే అధికారిక వాహనాన్ని ఉపయోగించాలని ఆదేశించారు.

అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఏసీ ఉష్ణోగ్రతలను 24 డిగ్రీల నుంచి 26 డిగ్రీల మధ్య నిర్వహించాలని చంద్రబాబు చెప్పారు. ఇంధన పరిరక్షణపై కూడా నొక్కిచెప్పారు. సుస్థిర పద్ధతులను ప్రోత్సహిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు, సౌరశక్తిని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఇంధన పరిరక్షణ, ఉత్పాదక పొదుపు, బాధ్యతాయుతమైన వినియోగం ద్వారా జాతీయ ప్రయోజనానికి పౌరులు సహకరించాలని కోరారు.

ఈ సమావేశంలో పలు కీలక విషయాలు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాయలసీమను ప్రపంచ స్థాయి హార్టికల్చర్ హబ్‌గా మార్చే లక్ష్యంతో రూ.1,00,000 కోట్లు అంచనా వ్యయంతో 'ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్‌మెంట్ ప్లాన్ (IHDP)' ప్రణాళిక, అమలుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. నీటిపారుదల అభివృద్ధి, నీటి భద్రత, రోడ్డు కనెక్టివిటీ, వ్యాల్యూ చైన్ పోటీతత్వం అన్నింటినీ కలిపిన సమగ్ర, కన్వర్జెంట్ కార్యక్రమంగా దీన్ని రూపొందించారు.

రూ.40 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయనున్నంది, మిగిలిన రూ.60 వేల కోట్లు ప్రైవేటు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంది. ఈ రూ.40 వేల కోట్లలో హార్టీకల్చర్కు రూ.14,906 కోట్లు, ఇరిగేషన్ కు రూ.20,884 కోట్లు, రూరల్ రోడ్డు డవలెప్మెంట్ పనులకు రూ.4,562 కోట్లు కేటాయిస్తారు. ప్రస్తుతం ఉన్న హార్టీకల్చర్ ఉత్పత్తులు 222 లక్షల టన్నులను 435 లక్షల టన్నులకు పెంచాలనే లక్ష్యంతో ఈ ప్రాజక్టును ప్రతిపాదించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More