ఏపీలో 2026 ప్రభుత్వ సెలవుల క్యాలెండర్.. ఏ రోజు ఏ హాలీడే చూడండి!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఏడాది 2026కి సంబంధించిన అధికారిక సెలవుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఏయే సెలవులు ఏ తేదీల్లో వచ్చాయో చూద్దాం..

Updated on: Dec 4, 2025, 19:51:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీలో 2026 సంవత్సరానికి సంబంధించి అధికారిక సెలవుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు సెలవులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఇవి కాకుండా రెండో శనివారం సెలవులు, ఆదివారాలు ఉంటాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ లిస్ట్ విడుదల చేసింది.

ఏపీలో 2026 ప్రభుత్వ సెలవుల క్యాలెండర్
ఏపీలో 2026 ప్రభుత్వ సెలవుల క్యాలెండర్

నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం, 1881 ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా పాటించే సాధారణ పండుగ, ప్రభుత్వ సెలవులు ఇందులో ఉన్నాయి. పౌరులు, విద్యార్థులు, ఉద్యోగులు.. సెలవులను ప్లాన్ చేయడానికి ఈ క్యాలెండర్‌ను ఉపయోగపడుతుంది.

  1. భోగి -14.01.2026 - బుధవారం

2. మకర సంక్రాంతి - 15.01.2026 - గురువారం

3. కనుమ - 16.01.2026 - శుక్రవారం

4. గణతంత్ర దినోత్సవం - 26.01.2026 - సోమవారం

5. మహా శివరాత్రి - 15.02.2026 - ఆదివారం

6. హోలీ - 03.03.2026 - మంగళవారం

7. ఉగాది - 19.03.2026 - గురువారం

8. ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) - 20.03.2026 - శుక్రవారం

9. శ్రీరామ నవమి - 27.03.2026 - శుక్రవారం

10. Annunal Closing Day - 01.04.2026 - బుధవారం

11. గుడ్ ఫ్రైడే - 03.04.2026 - శుక్రవారం

12. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి - 14.04.2026 - మంగళవారం

13. మే డే - 01.05.2026 - శుక్రవారం

14. ఈద్-ఉల్-అధా (బక్రీద్) - 27.05.2026 - బుధవారం

15. మొహర్రం - 25.06.2026 - గురువారం

16. స్వాతంత్ర్య దినోత్సవం - 15.08.2026 - శనివారం

17. మిలాద్-ఉన్-నబీ - 25.08.2026 - మంగళవారం

18. శ్రీ కృష్ణ అష్టమి - 04.09.2026 - శుక్రవారం

19. వినాయక చవితి - 14.09.2026 - సోమవారం

20. మహాత్మా గాంధీ జయంతి - 02.10.2026 - శుక్రవారం

21. దుర్గాష్టమి - 18.10.2026- ఆదివారం

22. విజయ దశమి - 20.10.2026 - మంగళవారం

23. దీపావళి - 08.11.2026 - ఆదివారం

24. క్రిస్మస్ - 25.12.2026 - శుక్రవారం

ఈ లిస్ట్ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, విద్యార్థులు, పౌరులు.. 2026 సంవత్సరానికి వారి షెడ్యూల్‌లు, సెలవులు, ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది. 2026లో కొన్ని పండుగలు రెండో శనివారాలు, ఆదివారాల్లో కూడా వస్తున్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More