ఏపీ అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్ ప్రవేశెపట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి, ఆర్థిక మంత్రి రూ.3,32,205 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లుగా అంచనా వేశారు. మూలధన వ్యయం రూ.53,915 కోట్లుగా అంచనా వేయగా.. రెవెన్యూ లోటు దాదాపు రూ.22,002 కోట్లుగా ఉంది. ద్రవ్య లోటు దాదాపు రూ.75,868 కోట్లుగా. రెవెన్యూ లోటు దాదాపు 1.11 శాతం ఉంటుంది. ఆర్థిక లోటు జీఎస్డీపీలో దాదాపు 3.84 శాతం ఉంటుంది.

రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు, విమానాశ్రయాలు, ఓడరేవులకు రూ.13,546, అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.6,000 కోట్లు కేటాయించారు. 9 జిల్లాలతో అమరావతి ఆర్థిక ప్రాంతం ఉంటుందని ప్రకటించారు. ఇంధన రంగానికి రూ.13.934 కోట్లు కేటాయించింది. వార్షిక బడ్జెట్‌ను హోంమంత్రి అనిత శాసన మండలిలో సమర్పించారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌ను ఆమోదించింది.
కేటాయింపులు ఇలా
- విద్యుత్ రంగానికి రూ.13,934 కోట్లు
- రోడ్లు, పోర్టు, ఎయిర్‌పోర్టులకు రూ.13,546 కోట్లు.
- రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.6 వేల కోట్లు.
- విశాఖ ఆర్థిక ప్రాంతానికి రూ.28,000 కోట్లు(ఇందులో పది జిల్లాలు).
- రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు రూ.30,000 కోట్లు.
- వీబీ జీ రామ్ జీకి.. రూ.8365 కోట్లు.
- గృహ నిర్మాణ రంగానికి రూ.5,451 కోట్లు.
- ఎన్టీఆర్ వైద్య సేవకు రూ.4000 కోట్లు.
- జల్ జీవన్‌కు రూ.4,000 కోట్లు.
- పరిశ్రమలకు రూ.3,161 కోట్లు.
- సర్దుబాటు నిధి.. రూ.1,500 కోట్లు.
- స్వచ్ఛ భారత్ మిషన్‌కు రూ.1,037 కోట్లు.
- మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు-రూ.9,906 కోట్లు.
- అన్నదాత సుఖీభవ-రూ.6,600 కోట్లు.
- పోలవరం-రూ.6,105 కోట్లు.
- రాష్ట్రీయ కృషి వికాస్ యోజన-రూ.1,927 కోట్లు.
- ధరల స్థిరీకరణ నిధి-రూ.500 కోట్లు.
- మత్స్యకార సేవ–రూ.260 కోట్లు.
- పంటల బీమా-రూ.250 కోట్లు.
- పీఎం కృషి సించాయి యోజన-రూ.190 కోట్లు.
- ఎన్టీఆర్ భరోసా-రూ.27,719 కోట్లు.
- దీపం 2.0 పథకం - రూ.2,601 కోట్లు.
- వివిధ వర్గాలకు ఆర్థిక మద్దతు-రూ.2,320 కోట్లు.
- స్త్రీశక్తి-రూ.1,420 కోట్లు.
- వీకర్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్-రూ.600 కోట్లు.
- ఆటో డ్రైవర్ల సేవలో- రూ.450 కోట్లు.
- తల్లికి వందనం-రూ.9,668 కోట్లు.
- స్త్రీ, శిశు సంక్షేమం-రూ.4,581 కోట్లు.
- ఉపకారవేతనాలు-రూ.3,836 కోట్లు.
- సమగ్ర శిక్ష- రూ.2,946 కోట్లు.
- ఉన్నత విద్య-రూ.2,566 కోట్లు.
- నైపుణ్యాభివృద్ధి-రూ.1,232 కోట్లు.
- పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా-రూ.707 కోట్లు.
- సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర-రూ.654 కోట్లు.
- యువత, క్రీడలు-రూ.438 కోట్లు.
- డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన స్కీమ్-రూ.2,161 కోట్లు.
- విద్యార్థులకు ఉపకార వేతనాలు -రూ.3836 కోట్లు.
- హాస్టళ్లు, గురుకులాలు-రూ.300 కోట్లు.
- మన బడి, మన భవిష్యత్-రూ.1,500 కోట్లు.
- పోలీస్ శాఖకు 3 వేల కొత్త వాహనాలు.
- కొత్త పోలీస్ అకాడమీ కోసం 94 ఎకరాలు.
- ప్రతీ జిల్లాకు ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్.
శాఖల వారీగా చూస్తే కేటాయింపులు ఇలా
- పంచాయతీ రాజ్ శాఖ-రూ.22,942 కోట్లు.
- పాఠశాల విద్యా శాఖ-రూ.32,308 కోట్లు.
- వ్యవసాయం, అనుబంధ రంగాలు-రూ.13,598 కోట్లు.
- మున్సిపల్ శాఖ-రూ.14,539 కోట్లు.
- ఇంధన శాఖ-రూ.13,934 కోట్లు.
- సాంఘిక సంక్షేమ శాఖ-రూ.11,118 కోట్లు.
- కార్మిక శాఖ-రూ.735 కోట్లు.
- గృహ నిర్మాణ శాఖ-రూ.6357 కోట్లు.
- ఎనర్జీ శాఖ-రూ.13,934 కోట్లు.
- ఆర్ అండ్ బీ శాఖ-రూ.9,856 కోట్లు.
- హోం శాఖ-9,165
శాఖల వారీగా చూస్తే కేటాయింపులు ఇలా
- పంచాయతీ రాజ్ శాఖ-రూ.22,942 కోట్లు.
- పాఠశాల విద్యా శాఖ-రూ.32,308 కోట్లు.
- వ్యవసాయం, అనుబంధ రంగాలు-రూ.13,598 కోట్లు.
- మున్సిపల్ శాఖ-రూ.14,539 కోట్లు.
- ఇంధన శాఖ-రూ.13,934 కోట్లు.
- సాంఘిక సంక్షేమ శాఖ-రూ.11,118 కోట్లు.
- కార్మిక శాఖ-రూ.735 కోట్లు.
- గృహ నిర్మాణ శాఖ-రూ.6357 కోట్లు.
- ఎనర్జీ శాఖ-రూ.13,934 కోట్లు.
- ఆర్ అండ్ బీ శాఖ-రూ.9,856 కోట్లు.
- హోం శాఖ-9,165