భూముల రీసర్వేపై జగన్ ది అసత్య ప్రచారం - రెవెన్యూ మంత్రి అనగాని

భూముల రీసర్వేపై జగన్ చేసిన వ్యాఖ్యలను రెవెన్యూ శాఖ మంత్రి అనగాని కొట్టిపారేశారు. వైసీపీ అధికారంలోకి రాకమందే 2018లో భూముల రీ సర్వేను టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తు చేశారు. కొత్త పాస్ పుస్తకంలో 15 రకాల భద్రతాపరమైన అంశాలున్నాయని చెప్పుకొచ్చారు.

Published on: Jan 22, 2026 9:57 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భూముల రీసర్వేపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఘాటుగా స్పందించారు. రీ సర్వేను 2018లోనే జగ్గయ్య పేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తు చేశారు. అప్పుడే రీ సర్వేను అత్యాధునిక టెక్నాలజీతో చేసేందుకు ఆర్వోఆర్ చట్టంలో మార్పులు తీసుకువస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు. కానీ జగన్ రెడ్డి మాత్రం తానే రీ సర్వేను కనిపెట్టినట్లు క్రిమినల్ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని విమర్శించారు.

మంత్రి అనగాని సత్యప్రసాద్
మంత్రి అనగాని సత్యప్రసాద్

చంద్రబాబు గురించి మాట్లాడే కనీస అర్హత జగన్ కు లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం రీ సర్వేను పూర్తిగా తప్పుల తడకగా నిర్వహించిందన్నారు. అందుకే ప్రజలు రీ సర్వే పై తమ ప్రభుత్వానికి 2.7 లక్షల ఫిర్యాదులు చేశారని చెప్పారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను అడ్డం పెట్టుకొని ప్రజల భూములను భక్షించేందుకు వీలుగా రీ సర్వేను నీరు కార్చారన్నారు. అందువల్లే గత ప్రభుత్వ రెవెన్యూ పాపాలపై 70 శాతం ప్రజల నుండి తమకు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. వైసీపీ నేతలకు భూములు అమ్మనివారని బెదిరించేందుకు ఆ భూములన్నీ 22ఎ నిషేధిత జాబితాలో పెట్టారని విమర్శించారు.

ప్రచార పిచ్చి కోసం సర్వే రాళ్లపై, పాస్ పుస్తకాలపై తన బొమ్మలు ముద్రించుకునేందుకు 700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని మంత్రి అనగాని దుయ్యబట్టారు. ప్రజా ధనాన్ని సొంత ప్రచారం కోసం ఖర్చు చేసే అధికారం జగన్ కు ఎక్కడదని ప్రశ్నించారు. పాస్ పుస్తకాలను కూడా తప్పుల తడకగా ప్రచురించారని, తన బొమ్మ, భూమికి సంబంధించిన ఒకటి రెండు వివరాలు తప్ప ఏ ఒక్కటీ అందులో సరిగ్గా లేదని అన్నారు. తాము రాజముద్రతో పాస్ పుస్తకం ఇచ్చామని, అందులో దాదాపు 15కు పైగా భద్రతా అంశాలను జోడించి ఇచ్చామని చెప్పారు.

అర్బన్ ప్రాంతంలో భూముల విలువకు, రిజిస్ట్రేషన్ విలువకు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉన్న చోట రేట్ల పెంపుదలపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More