కొనసాగుతున్న కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ - భవిష్యత్తులో ఆన్ లైన్ లో కూడా..!

రాష్ట్రంలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కొనసాగుతోంది. ఈ నెల 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు 6.07 లక్షల పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అయితే పాస్ పుస్తకాల్లో తప్పులు లేకుండా ఇవ్వాలని… ట్యాంపరింగ్ కు తావు ఉండొద్దని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 

Published on: Jan 7, 2026, 09:06:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రైతుల్లో నమ్మకం, భరోసా కల్గించేలా కొత్త పాస్ పుస్తకాలను అందచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తప్పులు లేకుండా రికార్డులను సరి చేసి కొత్త పాస్ పుస్తకాల పంపిణీ జరగాలని ఆదేశించారు. ఈ నెల 2వ తేదీ నుంచి మొదలైన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీపై మంగళవారం సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు.

పట్టాదారు పాస్ పుస్తకం
పట్టాదారు పాస్ పుస్తకం

ట్యాంపరింగ్ కు తావులేదు - సీఎం చంద్రబాబు

సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...”ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలతో రైతుల్లో నమ్మకం, భరోసా కలగాలి. భూ రికార్డుల్లో గతంలో జరిగిన తప్పులను సరిదిద్దాలి. కొత్త పాస్ పుస్తకాలను ముద్రించే ముందుగానే గ్రామసభల్లో ఆయా రైతుల నుంచి భూ వివరాలు నిర్ధారించుకోవాలి. ఆ తర్వాతే కొత్త పాస్ పుస్తకాలను ముద్రించాలి. రికార్డులను తారు మారు చేయడానికి ఆస్కారం లేని విధంగా కొత్త పాస్ పుస్తకాలను తీర్చిదిద్దాం. ఎవ్వరూ ట్యాంపర్ చేయకుండా, నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేయకుండా పాస్ పుస్తకాలను ముద్రించాలి. పాస్ పుస్తకాల ముద్రణలో ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలను రైతులకు అర్థమయ్యేలా చెప్పాలి.”అని ముఖ్యమంత్రి సూచించారు.

“మీ భూమి-మీ హక్కు. ఇది రైతులకు ప్రభుత్వం కల్పించే భరోసా. ప్రస్తుతం ఇస్తున్న కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల ద్వారా తమ భూమి భద్రంగా ఉందా..? లేదా..? అనే విషయాన్ని రైతులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. రికార్డుల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే... కచ్చితంగా భూ యజమాని అనుమతితోనే జరగాల్సి ఉంటుంది. రికార్డులు భద్రంగా ఉండేలా కొత్త పాస్ పుస్తకాలను ముద్రించాం. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను రైతులకు వివరించాలి. భవిష్యత్తులో రెవెన్యూ శాఖ ప్రమేయం లేకుండానే రైతులు వారికి అవసరమైన పాస్ పుస్తకాలను ఆన్ లైన్లో పొందే విధానాన్ని అమలు చేయాలి. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో టెక్నాలజీని వినియోగించుకోవాలి.”అని సీఎం వివరించారు.

6.07 లక్షల పాస్ పుస్తకాల పంపిణీ…

పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీపై సమీక్ష సందర్భంగా క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పంపిణీ విధానాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నెల 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు 6.07 లక్షల పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశామని సీఎంకు తెలిపారు. పట్టాదార్ పాస్ పుస్తకాల మీద రాజముద్ర, క్యూఆర్ కోడ్ వేయడంతోపాటు... మీ భూమి-మీ హక్కు, జై భారత్... జై తెలుగుతల్లి అనే నినాదాలు కూడా ముద్రించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More