...
...
Next Story

AP Govt Jobs : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు.. పదో తరగతి పాసైతే చాలు

AP Govt Jobs : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలపై కీలక అప్డేట్ వచ్చింది. ఆశా కార్యకర్తల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Published on: Sep 7, 2026, 22:09:04 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మెరుగైన ప్రాథమిక వైద్యా సేవలు అందించే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 913 ఆశా(Accredited Social Health Activists - ASHA) కార్యకర్తల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు

ఆరోగ్య శాఖలో ఎక్కడా ఖాళీలు ఉండకూడదనే జీరో వేకెన్సీ విధానంలో భాగంగానే ఈ పోస్టుల భర్తీ చేపడుతున్నట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. గడిచిన రెండేళ్ల కాలంలో ఇప్పటికే 1,294 ఆశా పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమోదించిన 913 పోస్టుల ప్రాంతాల వారీ వివరాలు చూసుకుంటే.. గ్రామీణ ప్రాంతాలు 673 పోస్టులు, పట్టణ ప్రాంతాలు 176 పోస్టులు, గిరిజన ప్రాంతాలు 64 పోస్టులు ఉన్నాయి.

రాష్ట్రంలో భర్తీ చేయనున్న పోస్టులలో అనకాపల్లి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. జిల్లాల వారీగా ప్రధాన ఖాళీల వివరాలు: అనకాపల్లి 77 పోస్టులు, కర్నూలు 65 పోస్టులు, తూర్పు గోదావరి 44 పోస్టులు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 43 పోస్టులు ఉన్నాయి.

10వ తరగతి ఉత్తీర్ణత సాధించి, 25 నుంచి 45 ఏళ్ల వయస్సు కలిగిన స్థానిక మహిళలకు ఈ నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తారు. ప్రతినెల ప్రతి ఆశా కార్యకర్తకు రూ. 10,000 గౌరవ వేతనం అందుతుంది. ఈ వేతనంలో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ. 8,320 చెల్లిస్తుండగా, మిగిలిన మొత్తం రూ. 1,680ని కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తోంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe