ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నక్సల్ రహిత రాష్ట్రంగా మారిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. మావోయిస్టు ఏఓబీ రాష్ట్ర కమిటీ సభ్యుడు చెల్లూరు నారాయణరావు అలియాస్ సోమన్నతోపాటు ఏఓబీ ప్రత్యేక జోనల్, ఏరియా, డివిజనల్ కమిటీలకు చెందిన పలువురు సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేయడానికి కేంద్రం మార్చి 31ని గడువుగా నిర్ణయించిన విషయం తెలిసిందే.

కేంద్రం హెచ్చరికల అనంతరం పలువురు నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారని డీజీపీ తెలిపారు. సోమవారం(మార్చి 30) మీడియాతో మాట్లాడుతూ.. నారాయణ రావుతో సహా తొమ్మిది మంది మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టారని డీజీపీ చెప్పారు. అరెస్టు అయిన వారిలో పోడియం రాజే, కర్తం అడామే, ముచ్చిక మాస, మాడావి జోగి, ముచ్చిక లక్ష్మణ్, కడిటి హుర్రే ఉన్నారు.
చెల్లూరి నారాయణరావుపై రూ.25 లక్షలు, కర్తంపై రూ.5 లక్షలు, పొడియం రాజే, ముచ్చిక మాస, మడావి జోగి, కర్తం ఆడమెల తలా రూ.4 లక్షలు, మడివి ఆడమ, ముచ్చిక లక్ష్మణ్, కడిటి కుర్రెలపై రూ.లక్ష రివార్డు ఉన్నట్లు డీజీపీ తెలిపారు. మొత్తం వారి ఖాతాలకు బదిలీ చేస్తామన్నారు. లొంగిపోయిన నక్సల్స్‌కు తక్షణ సాయంగా రూ.20,000 అందజేశారు.
లొంగుబాటు సందర్భంగా భారీ ఆయుధ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మారుమూల గ్రామాలకు చేరుతుండటం, ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా మార్పు కారణంగా ఉద్యమ ఉనికి తగ్గుతోందని సోమన్న చెప్పారు. అందుకే సాయుధ పోరాటాన్ని వీడి లొంగిపోయినట్లు వెల్లడించారు.
ఇటీవలి కాల్పుల ఘటనలో 18 మంది నక్సల్స్ హతమయ్యారు. కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 50 మందికి పైగా మావోయిస్టు కమిటీ సభ్యులను కూడా అరెస్టు చేశారు.
{{/usCountry}}ఇటీవలి కాల్పుల ఘటనలో 18 మంది నక్సల్స్ హతమయ్యారు. కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 50 మందికి పైగా మావోయిస్టు కమిటీ సభ్యులను కూడా అరెస్టు చేశారు.
{{/usCountry}}శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన నారాయణరావు సుమారు 35 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు. 1989లో పీపుల్స్ వార్ గ్రూప్‌లో చేరారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మిలిటరీ ఆపరేషన్లలో ఆరితేరారు. కిందటి ఏడాది అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కీలక నేతలు గాజర్ల రవి, అరుణ మరణం తర్వాత.. ఏవోబీ బాధ్యతలను సోమన్న చేపట్టారు. సోమన్న మీద ఏపీతోపాటుగా ఒడిశాలో పలు కేసులు ఉన్నాయి.