Maoists Surrender : సీఎం రేవంత్ రెడ్డి ముందు లొంగిపోనున్న 124 మంది మావోయిస్టులు
సీఎం రేవంత్ రెడ్డి ముందు 124 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఉండనుంది.
సీఎం రేవంత్ రెడ్డి ముందు 124 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. దేవ్‌జీకి చెందిన PLGA కమిటీ మొత్తం సరెండర్ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయుధాలతో సహా లొంగిపోనున్నారు. ఈ సందర్భంగా మావోయిస్టులు 70 ఆయుధాలను అప్పగించనున్నట్లు సమాచారం.

ఇటీవల అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ అలియాస్ కుమ్మా దాదా, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, బడే చొక్కారావు, నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్న లొంగిపోయారు. అంతకుముందు లొంగిపోయిన మావోయిస్టుతో కలిసి సచివాలయంలో కొన్ని రోజుల కింద సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
దశాబ్దాల పాటు అడవిలో ఉన్న వీరంతా జనజీవన స్రవంతిలో కలిశారు. అయితే ఈ అగ్రనేతలంతా నేరుగా సచివాలయంలో ముఖ్యమంత్రితో సమావేశం కావటం ఆసక్తికరంగా మారింది. లొంగిపోయిన నేతలు.. వారి పునరావాసం, కుటుంబాల భద్రతపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం వీరు చేపట్టబోయే తదుపరి కార్యాచరణపై ముఖ్యమంత్రికి వివరించినట్లు సమాచారం.
లొంగిపోయిన మావోయిస్టులు తమ రాజకీయ ఎజెండా గురించి కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రితో తమ సమావేశం కూడా దాని చుట్టూనే తిరుగుతుందని మాజీ మావోలు కూడా స్పష్టం చేశారు. ప్రజల్లో ఉంటూనే వారికి సేవ చేయనున్నట్టుగా తెలిపారు.
కొన్ని రోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డితో మాజీ మావోయిస్టుల భేటీలో ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్, స్పెషల్ బ్రాంచీ ఐజీ సుమతి పాల్గొన్నారు.
తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమితాషాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన విషయాన్ని అమిత్ షాకు సీఎం చెప్పారు. ఇటీవల కాలంలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు కూడా సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు వచ్చారని, వారికి నిబంధనల ప్రకారం అందజేస్తున్న పరిహారం, పునరావాసం విషయాలను కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి వివరించారు. అయితే ఈ సందర్భంగా మావోయిస్టు గణపతి లొంగుబాటు గురించి చర్చ జరిగింది. కానీ ఈ విషయంపై క్లారిటీ మాత్రం లేదు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper












