...
...
Next Story

Andhra Pradesh Covid Cases : ఏపీలో కొత్తగా 7 కరోనా కేసులు - 26కు చేరిన సంఖ్య..!

Andhra Pradesh Covid Cases : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 7 కోవిడ్-19 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 26కు చేరింది. అత్యధికంగా గుంటూరులో 4, ఈస్ట్ గోదావరిలో 2, బాపట్లలో 1 కేసు వెలుగుచూశాయి. ఎలాంటి క్లస్టర్ అవుట్‌బ్రేక్ లేదని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

Published on: Jul 22, 2026, 05:12:25 IST
Advertisement

Andhra Pradesh Covid Cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ నమోదు కావడం ప్రజల్లో కొంత ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మంగళవారం ఒక్క రోజే కొత్తగా 7 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 26కు చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కొవిడ్ కేసులు
కొవిడ్ కేసులు

తాజాగా వెలుగుచూసిన 7 కేసుల్లో గుంటూరు జిల్లా నుంచి నాలుగు, తూర్పు గోదావరి జిల్లా నుంచి రెండు, బాపట్ల జిల్లా నుంచి ఒక కేసు నమోదయ్యాయి. ఇక రాష్ట్రమంతటా నమోదు కాబడిన మొత్తం 26 కేసులలో అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లాలో 8 కేసులు వెలుగుచూశాయి.

జిల్లాల వారీగా కేసులు చూస్తే:

  • కడప: 8
  • గుంటూరు: 6
  • తూర్పు గోదావరి: 3
  • కాకినాడ: 2
  • బాపట్ల: 2

వీటితో పాటు విశాఖపట్నం, ఏలూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ఎన్టీఆర్ మరియు పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య శాఖ వెల్లడించిన బులెటిన్ ప్రకారం…. రాష్ట్రంలో ఇప్పటివరకు 145 శాంపిళ్లను పరీక్షించారు. నమోదైన 26 మంది బాధితులలో 10 మంది ప్రస్తుతం ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. 9 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ కోలుకుంటున్నారు. 3 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 4 మంది చికిత్స పొందుతూ మరణించారు.

ఆందోళన అవసరం లేదు : వైదారోగ్యశాఖ

వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందిస్తూ…. కరోనా వల్ల మరణించిన నలుగురు రోగులూ ఇదివరకే తీవ్రమైన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వివరించారు. మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాల వ్యాధులు వంటి తీవ్ర ముందస్తు సమస్యలు ఉండటంతో వారు కోలుకోలేకపోయారని పేర్కొన్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe