...
...
Next Story

రాప్తాడు స్కూల్ ఘటన - బాలికకు బెంగళూరులో అత్యవసర వైద్యం

అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థినులపై రంపంతో జరిగిన దాడి తీవ్ర కలకలం రేపింది. తీవ్రంగా గాయపడిన బాలికను గ్రీన్ కారిడార్ ద్వారా బెంగళూరుకు తరలించారు. ప్రస్తుతం చికిత్సొ కొనసాగుతోంది.

Published on: Nov 1, 2026, 07:21:02 IST
Advertisement

అనంతపురం జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులపై ఓ ఉన్మాది చైన్‌సా(రంపం)తో దారుణంగా దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. ఏకంగా క్లాస్‌రూమ్‌లోకి చొరబడిన దుండగుడు బాలికలపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఒక బాలికను మెరుగైన చికిత్స కోసం శనివారం ప్రత్యేకంగా బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.

గ్రీన్ కారిడార్ ఏర్పాటు.. బెంగళూరుకు తరలింపు

బాలికకు బెంగళూరులో అత్యవసర వైద్యం
బాలికకు బెంగళూరులో అత్యవసర వైద్యం

దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక పరిస్థితి విషమంగా మారడంతో మొదట అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)లో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం తల్లిదండ్రుల అంగీకారంతో బాలికను బెంగళూరుకు తరలించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. నిపుణులైన వైద్యుల బృందంతో కలిసి రెండు అంబులెన్సుల ద్వారా ఆమెను పంపించారు. ఈ ప్రయాణం వేగంగా సాగేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం, బెంగళూరు పోలీసులు పూర్తి స్థాయిలో సహకరించి గ్రీన్ కారిడార్‌తో పాటు పోలీస్ ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేశారు.

వైద్యులు తెలిపిన ప్రకారం.. బాలిక శరీరంపై తీవ్రమైన గాయాలయ్యాయి. కుడి చేయి పూర్తిగా తెగిపోవడంతో పాటు మెడ, ముఖం, స్కల్ (తస్క అస్థి), పక్కటెముకలకు తీవ్ర విరిగిన గాయాలయ్యాయి. రక్తం భారీగా ప్రాణాపాయ స్థితికి చేర్చడంతో వైద్యులు 10 యూనిట్ల రక్తాన్ని ఎక్కించి రక్తస్రావాన్ని అదుపులోకి తెచ్చారు. అనంతపురం జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ డి. మల్లేశ్వరి మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు సమర్పించిన నివేదిక ప్రకారం…. బాలిక పాలిట్రామా, హైపోవొలేమిక్ షాక్, ప్యూమోథొరాక్స్, ముఖం ఎముకల విరుపులు, సీ3 వెన్నుముక భాగం దెబ్బతినడం సహా శరీరంపై అనేక చోట్ల తీవ్ర గాయాలతో బాధపడుతోంది.

కొనసాగుతున్న చికిత్స…

ప్రస్తుతం బాధితురాలి రక్తపోటు నిలకడగా ఉందని, శరీరంలోని ముఖ్య అవయవాల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మణిపాల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. బాలిక పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ, నిపుణులైన శస్త్రచికిత్స నిపుణులు, ఐసీయూ (ICU) వైద్య బృందం ఆధ్వర్యంలో ఆమెకు నిరంతరం నిశిత వైద్య సంరక్షణ అందిస్తున్నారు.

బాలికను బెంగళూరుకు తరలించే ముందు మంత్రి సత్య కుమార్ యాదవ్ పరామర్శించారు. "ఆమె పూర్తి స్పృహలోనే ఉంది. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగినప్పుడు ధైర్యంగా థంబ్స్-అప్ సింబల్ చూపిస్తూ బదులిచ్చింది," అని మంత్రి గుర్తుచేసుకున్నారు. బాధితురాలి వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు.

దుండగుడు దాడి చేస్తుండగా తన తోటి విద్యార్థినిని కాపాడేందుకు మరో బాలిక ధైర్యంగా అడ్డువెళ్లింది. ఈ క్రమంలో ఆమె మడమ వద్ద తీవ్ర గాయమై ఎముక విరిగింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా స్నేహితురాలిని కాపాడేందుకు యత్నించిన ఈ బాలిక ధైర్యసాహసాలను గుర్తించిన మంత్రి సత్యకుమార్…. ఆమె పేరును ప్రధానమంత్రి జాతీయ వీరత్వ పురస్కారానికి సిఫార్సు చేసినట్లు తెలిపారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks