...
...
Next Story

AP Aqua Farmers : ఆక్వా రైతులకు ఊరట - రొయ్యల ఫీడ్ ధరల పెంపు నిలిపివేత

AP Aqua Farmers : రొయ్యల ఫీడ్ ధరల పెంపును తయారీదారులు విరమించుకున్నారు. కిలోకు రూ.10 వరకు పెంచాలన్న నిర్ణయాన్ని తక్షణమే నిలిపివేస్తూ బుధవారం జరిగిన చర్చల్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు జోక్యంతో ఈ సమస్యకు పుల్ స్టాప్ పడింది.

Published on: May 13, 2026, 13:27:14 IST
Advertisement

AP Aqua Farmers : రాష్ట్రంలోని ఆక్వా రైతుల పాలిట శాపంగా మారిన రొయ్యల ఫీడ్ ధరల పెంపు నిర్ణయం ఎట్టకేలకు వెనక్కి వెళ్ళింది. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జోక్యంతో…. ఫీడ్ తయారీ కంపెనీలు తాము పెంచాలనుకున్న ధరల నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు అంగీకరించాయి. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఆక్వా రైతులకు పెద్ద ఊరటనిచ్చింది.

ఇటీవలే పెంపు…

ఆక్వా రైతులకు ఊరట - రొయ్యల ఫీడ్ ధరల పెంపు నిలిపివేత
ఆక్వా రైతులకు ఊరట - రొయ్యల ఫీడ్ ధరల పెంపు నిలిపివేత

ఇటీవల రొయ్యల ఫీడ్ తయారీదారులు కిలోకు రూ.10 వరకు ధర పెంచాలని ఏకపక్షంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులు, పెరిగిన సాగు వ్యయంతో ఇబ్బంది పడుతున్న రైతులకు, ఈ పెంపు గోరుచుట్టుపై రోకలిపోటులా మారింది.

ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫీడ్ తయారీదారుల సంఘం ప్రతినిధులు, రైతు సంఘాల నేతలు మరియు ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.

సమీక్షా సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు కంపెనీల తీరుపై స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. "రైతుల జీవనోపాధిని దెబ్బతీసేలా తీసుకునే ఏకపక్ష నిర్ణయాలను ప్రభుత్వం సహించదు. రైతుల ప్రయోజనాలను కాపాడటమే మా ప్రాథమిక లక్ష్యం," అని ఆయన నొక్కి చెప్పారు.

పెంచిన ధరలను తక్షణమే నిలిపివేయాలని ఆయన ఇచ్చిన ఆదేశాలకు తయారీదారులు సానుకూలంగా స్పందించారు. సాగు వ్యయాలను తగ్గించి, రైతులకు లాభదాయకమైన పరిస్థితులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని… ఆక్వా రంగానికి అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

పెంచిన ధరల విరమణతో రాష్ట్రంలోని అక్వా రంగం కుదుటపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks