ఆంధ్ర యూనివర్సిటీలో ఫార్ములా-1 రేసింగ్ కార్ ఎగ్జిబిషన్.. RB14 హంగామా!
Andhra University : ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఫార్ములా-1 రేసింగ్ కార్ ఎగ్జిబిషన్ జరగనుంది. విశాఖపట్నంలో RB14 హంగామా చేయనుంది.
విశాఖపట్నం వేదికగా ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) ఇంజనీరింగ్ కళాశాల (A) గ్రౌండ్‌లో ఆస్తికరమైన కార్యక్రమం జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ప్రపంచ ప్రసిద్ధ ‘RB14 ఫార్ములా-1 రేసింగ్ కార్’ (RB14 F1 Car) ప్రదర్శనను ఈ నెల 20న నిర్వహించనున్నారు.

ఏయూ బాస్కెట్‌బాల్ కోర్టులో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ బృహత్తర ఎగ్జిబిషన్ జరగనుంది. ఈ ప్రదర్శనకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. వెంకట సుబ్బయ్య ఆవిష్కరించారు. ఏయూ యునైటెడ్ స్టూడెంట్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ వేడుకను ఏర్పాటు చేస్తున్నారు. క్లబ్ నిర్వాహకులు అక్షయ్, యశ్వంత్, రవికాంత్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఒక ఫార్ములా-1 రేసింగ్ కార్ అధికారికంగా ప్రదర్శించబడటం ఇదే మొదటిసారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ అరుదైన అవకాశాన్ని విద్యార్థులు, మోటార్ స్పోర్ట్స్ ప్రేమికులు ఉపయోగించుకోవాలని ఆహ్వానించారు.
ఏమిటీ RB14 రేసింగ్ కార్ ప్రత్యేకత?
రెడ్ బుల్ రేసింగ్ జట్టుకు చెందిన ఈ RB14 కారు 2018 మోటార్ స్పోర్ట్ ప్రపంచంలో విశేష పేరు తెచ్చుకుంది. ఇంజిన్ సామర్థ్యం ఇందులో 1.6 లీటర్ టర్బోచార్జ్డ్ V6 ఇంజిన్ ఉంటుంది. ఇది దాదాపు 900 హార్స్ పవర్ కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఈ కారు గంటకు 340 కిలోమీటర్లకు పైగా గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. కార్బన్ ఫైబర్ మోనోకోక్ ఛాసిస్, హై-స్పీడ్ ఏరోడైనమిక్ డిజైన్ మరియు రైడర్ భద్రత కోసం ప్రత్యేక ‘హాలో’ (Halo) వ్యవస్థను ఇందులో ఉపయోగించారు.
సాధారణంగా ఫార్ములా-1 రేసింగ్ కార్లను కేవలం టీవీలు లేదా అంతర్జాతీయ రేసింగ్ ట్రాక్‌లపై మాత్రమే చూస్తుంటాం. అయితే ఈ ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థులు చాలా దగ్గరగా ఈ కారును వీక్షించడమే కాకుండా, దాని అద్భుతమైన ఏరోడైనమిక్స్, ఇంజిన్ ఇంజనీరింగ్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. విద్యార్థులలో ఇంజనీరింగ్, ఆటోమొబైల్ రంగాలపై ఆసక్తిని పెంపొందించడానికి ఈ తరహా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఏయూ అధికారులు చెబుతున్నారు. విద్యార్థులందరూ పెద్ద సంఖ్యలో హాజరై ఈ సూపర్ కార్ ప్రదర్శనను తిలకించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


