బొండాడ ఇంజనీరింగ్ ధమాకా: క్యూ1లో ₹54 కోట్ల నికర లాభం
2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ రూ. 691.65 కోట్ల ఆదాయంతో 24 శాతం వృద్ధి సాధించింది. కంపెనీ నికర లాభం 29 శాతం పెరిగి రూ. 53.94 కోట్లకు చేరింది.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజం బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (క్యూ1) ఆర్థిక ఫలితాలలో రికార్డు వృద్ధి నమోదు చేసింది. జూన్ 30, 2026తో ముగిసిన త్రైమాసికానికి కంపెనీ ఏకీకృత (Consolidated) ఆదాయం రూ. 691.65 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 24 శాతం వృద్ధిని సూచిస్తోంది. పునరుత్పాదక ఇంధనం, టెలికామ్, ఈపీసీ (EPC), ఇంజనీరింగ్ సేవల్లో ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం వల్ల ఈ విజయం సాధ్యమైంది.

ఈ త్రైమాసికంలో కంపెనీ లాభదాయకత కూడా గణనీయంగా పెరిగింది. పన్నుకు ముందు లాభం (PBT) 27 శాతం పెరిగి రూ. 72.71 కోట్లకు చేరుకోగా, నికర లాభం (PAT) 29 శాతం వృద్ధితో రూ. 53.94 కోట్లుగా నమోదైంది. నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు వ్యయ నియంత్రణ పాటించడం వల్ల కంపెనీ లాభాలు మెరుగయ్యాయి.
స్టాండ్‌అలోన్ ఆదాయంలోనూ జోరు
కంపెనీ స్టాండ్‌అలోన్ వ్యాపారం కూడా బలమైన వృద్ధి రేటును కొనసాగించింది. స్టాండ్‌అలోన్ నిర్వహణ ఆదాయం 23 శాతం పెరిగి రూ. 626.77 కోట్లకు చేరింది. అలాగే నికర లాభం (PAT) 21 శాతం వృద్ధితో రూ. 47.70 కోట్లను తాకింది. ప్రధాన వ్యాపార విభాగాల్లో నమోదు చేసిన ఈ క్రమశిక్షణతో కూడిన వృద్ధి, బొండాడ ఇంజనీరింగ్ మౌలిక సామర్థ్యానికి అద్దం పడుతోంది.
సద్వినియోగానికి సిద్ధం
"2026-27 ఆర్థిక సంవత్సరంలో సాధించిన ఈ బలమైన ఆరంభం మా వ్యాపార నమూనా స్థిరత్వానికి నిదర్శనం. పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ మౌలిక వసతులు, టెలికామ్ రంగాల్లో భారతదేశం వేగంగా పెట్టుబడులు పెడుతున్న తరుణంలో, మాకున్న విస్తృత ప్రాజెక్టు పైప్‌లైన్‌తో ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం" అని బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొండాడ రాఘవేంద్రరావు తెలిపారు.
ఫలితాలపై కంపెనీ హోల్-టైమ్ డైరెక్టర్ & సీఎఫ్ఓ సీఏ బారటం సత్యనారాయణ మాట్లాడుతూ.. "డిసిప్లిన్డ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ఆపరేషనల్ ఎక్సలెన్స్ వల్ల క్యూ1లో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. మూలధనాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ, ఆరోగ్యకరమైన బాలెన్స్ షీట్‌ను నిర్వహిస్తూ లాభదాయకమైన వృద్ధి దిశగా పయనిస్తున్నాం" అని వివరించారు.
మౌలిక రంగంలో వేగవంతమైన పురోగతి
2012లో ప్రారంభమైన బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ (BSE: 543971) గడిచిన 14 ఏళ్లలో దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ భాగస్వామిగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆధునిక ఉత్పాదక యూనిట్లతో పాటు అనుభవజ్ఞులైన నిపుణులతో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. టెలికామ్, గ్రీన్ ఎనర్జీ, రైల్వేస్ రంగాల్లో కీలక ప్రాజెక్టులను పూర్తి చేస్తూ దేశీయ ఇంజనీరింగ్ విభాగంలో తన ఉనికిని చాటుకుంటోంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


