Kabaddi Player Wife: అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ భార్య సూసైడ్- వేధింపులే కారణమని ఆరోపణలు- ఆత్మహత్యకు ఒక్కరోజు ముందే రీల్!

Kabaddi Player Sheelu Balhara Wife Suicide: అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు షీలు బల్హారా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన 23 ఏళ్ల భార్య ముస్కాన్ హర్యానాలోని రోహ్‌తక్‌లో ఉన్న తమ నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. షీలు వేధింపుల వల్లే సూసైడ్ చేసుకుందని ముస్కాన్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

Published on: Aug 1, 2026, 15:05:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kabaddi Player Sheelu Balhara Wife Suicide: అంతర్జాతీయ కబడ్డీ స్టార్, ప్రముఖ క్రీడాకారుడు షీలు బల్హారా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య ముస్కాన్ (23) హర్యానాలోని రోహ్‌తక్ జిల్లా మెహమ్ ప్రాంతంలో ఉన్న తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం (జూలై 31) మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది.

అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ భార్య సూసైడ్- వేధింపులే కారణమని ఆరోపణలు- ఆత్మహత్యకు ఒక్కరోజు ముందే రీల్!
అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ భార్య సూసైడ్- వేధింపులే కారణమని ఆరోపణలు- ఆత్మహత్యకు ఒక్కరోజు ముందే రీల్!

బాబు పుట్టిన ఏడాది కాకముందే

ముస్కాన్‌, షీలు బల్హారా వివాహం డిసెంబర్ 2023లో జరిగింది. వీరికి గతేడాది నవంబర్‌లో 'హార్దిక్' అనే బాబు జన్మించాడు. చిన్నారి పుట్టి ఏడాదైనా కాకముందే ముస్కాన్ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

చనిపోయే ఒక్కరోజు ముందే సోషల్ మీడియా రీల్!

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆధారాల సేకరణ కోసం ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించారు. ముస్కాన్ ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆత్మహత్య చేసుకోవడానికి ఒక్కరోజు ముందే ఆమె ఒక పంజాబీ పాటకు ఇన్‌స్టా రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

పోలీసుల విచారణ

ఆ వీడియోకు ఆత్మహత్యకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అలాగే, పంజాబీ పాటకు రీల్ చేసి ఇంతలోనే ఆమె ప్రాణాలు తీసుకోవడం వెనుక ఉన్న కుటుంబ కలహాల కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.

ముస్కాన్ ఇంటి సభ్యుల ఆందోళన

మరోవైపు ముస్కాన్ కుటుంబ సభ్యులు మాత్రం వేధింపుల వల్లే సూసైడ్ చేసుకుందని ఆరోపిస్తున్నారు. షీలు ఇంటి ముందు ముస్కాన్ ఇంటి సభ్యులు ఆందోళన చేపట్టారు. షీలుతోపాటు అతడి కుటుంబ సభ్యుల నుంచి స్టేట్‌మెంట్స్ తీసుకున్నట్లుగా రోహ్‌తక్ ఎస్పీ గౌరవ్ రాజ్‌పురోహిత్ తెలిపారు.

నవవధువుల ఆత్మహత్యలు.. వరుస దారుణాలు

ఇటీవలి కాలంలో నవవధువులు, వివాహితలు మనస్తాపంతో ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో కూడా ఇటువంటి విషాదకర సంఘటన జరిగింది. ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్న సృష్టి కంధారీ అనే యువతి, అత్తమామల వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంది.

అదనపు కట్నం కోసం

గతేడాది నవంబర్‌లో ప్రభుత్వ ఉద్యోగి సౌరభ్ రాతోడీతో సృష్టికి పెళ్లయింది. పెళ్లయినప్పటి నుంచి అదనపు కట్నం కోసం, "అదృష్టహీనురాలివి, శనిదానివి" అంటూ అత్తమామలు, భర్త మానసికంగా తీవ్రంగా వేధించారని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చనిపోయే ముందు సృష్టి రికార్డ్ చేసిన 90 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

6 నెలలుగా నరకం అనుభవిస్తున్నానంటూ

"సారీ మమ్మీ.. నేను ఇలా వెళ్తున్నా. ఆరు నెలలుగా నరకం అనుభవిస్తున్నా. ఇక నా వల్ల కావడం లేదు. వాళ్ల ఆలోచనలు ఎప్పటికీ మారవు" అని కన్నీళ్లతో సృష్టి చెప్పిన మాటలు ప్రతీ ఒక్కరినీ కలచివేసాయి.

(నోట్: మానసిక ఒత్తిళ్లకు హెల్ప్ లైన్ నెంబర్స్: ఇలాంటి మానసిక ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలతో బాధపడేవారు తొందరపడి ప్రాణాలు తీసుకోకూడదని మానసిక నిపుణులు కోరుతున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే ఉచిత హెల్ప్‌లైన్ నంబర్లు వండ్రేవాలా ఫౌండేషన్ (9999666555), TISS ఐకాల్ (022-25521111) ద్వారా సలహాలు, సహాయం పొందవచ్చు.)

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More