Nushrratt Bharuccha: హాట్ బ్యూటీ నుస్రత్ ఇన్‌స్టా స్టోరీ వైరల్- ఆర్సీబీ విక్టరీ వీడియోలో శృంగార శ‌బ్దాలు- అసలు నిజమిదే!

Nushrratt Bharuccha: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఘనవిజయం సాధించిన వేళ, బాలీవుడ్ నటి నుస్రత్ భరుచా సోషల్ మీడియా పోస్ట్ ఒకటి నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

Jun 3, 2026, 09:13:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Nushrratt Bharuccha: బాలీవుడ్ హాట్ బ్యూటీ నుస్రత్ భరుచా పేరు ఇప్పుడు మార్మోగుతోంది. ఈ భామ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె పెట్టినట్లు చెబుతున్న ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీని వెనుకాల ఉన్న అసలు నిజం ఏంటీ? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

హాట్ బ్యూటీ నుస్రత్ ఇన్‌స్టా స్టోరీ వైరల్ (instagram)
హాట్ బ్యూటీ నుస్రత్ ఇన్‌స్టా స్టోరీ వైరల్ (instagram)

ఆర్సీబీ విక్టరీ

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆర్సీబీ సాధించిన ఈ చరిత్రాత్మక విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ నుస్రత్ భరుచా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక స్టోరీని షేర్ చేశారనే వార్త విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. ఆమె విన్నింగ్ మూమెంట్స్ వీడియోను స్టోరీగా పెట్టారనే పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.

నుస్రత్ భరుచా స్టోరీ

నుస్రత్ భరుచా పోస్టు చేసినట్లు చెబుతున్న ఆ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వీడియోలో ఆర్సీబీ గెలిచిన మూమెంట్స్ ఉన్నాయి. కానీ దానికి బ్యాక్‌గ్రౌండ్‌లో వినడానికే అసహ్యంగా ఉన్న ఒక శబ్దాలు ఉండటం ఇక్కడ అసలు వివాదానికి కారణమైంది. అవి శృంగార శ‌బ్దాలుగా వినిపిస్తున్నాయనే కామెంట్లు వస్తున్నాయి. ఆ సమయంలో నుస్రత్ శృంగారంలో పాల్గొంటుందేమోననే పోస్టులు వైరల్ గా మారాయి.

ఈ పోస్ట్ కాస్తా క్షణాల్లోనే అటు క్రికెట్ అభిమానుల్లో, ఇటు సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. అయితే, అసలు ఈ వీడియో నిజమైనదేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నెట్టింట వైరల్

ఆర్సీబీ ఐపీఎల్ 2026 టైటిల్ గెలిచిన ఆనందంలో అభిమానులు ఉండగా, వినడానికి ఇబ్బందికరంగా ఉన్న ఆ శబ్దంతో కూడిన నుస్రత్ భరుచా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ స్క్రీన్ క్లిప్ వైరల్‌గా మారింది. ఈ వీడియో వివిధ సోషల్ మీడియా వేదికలపై దావానలంలా వ్యాపించింది. ఆర్సీబీ విజయోత్సవాలు, విరాట్ కోహ్లీ ఐపీఎల్ ట్రోఫీ అందుకోవడం, సినీ ప్రముఖుల స్పందనల గురించి నెటిజన్లు పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్న తరుణంలోనే ఈ వీడియో కూడా బయటకు వచ్చింది.

ఈ స్క్రీన్ క్యాప్చర్ విపరీతంగా ట్రెండ్ అవుతుండటంతో, కొందరు నెటిజన్లు అసలు దీని విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు. నిజంగానే నుస్రత్ భరుచా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి ఈ వివాదాస్పద స్టోరీని పోస్ట్ చేసిందా? లేదా అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.

ఎంతవరకు నిజముంది?

ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా హల్‌చల్ చేస్తున్న ఈ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని నుస్రత్ భరుచానే స్వయంగా షేర్ చేసిందనడానికి ఎలాంటి అధికారిక లేదా ధృవీకరించిన ఆధారాలు లేవు. సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న ఆ స్క్రీన్ రికార్డుకు, నటి అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఉన్న పోస్టులకు ఎక్కడా పొంతన కుదరడం లేదు.

ఫ్యాక్ట్ చెక్

ప్రాథమిక పరిశీలన ప్రకారం, నెట్టింట చక్కర్లు కొడుతున్న ఆ స్క్రీన్ రికార్డ్ వీడియో తప్పుదోవ పట్టించేలా ఉందని, దీనిని స్వతంత్రంగా ధృవీకరించడం సాధ్యం కాదని స్పష్టమవుతోంది. ఐపీఎల్ 2026 ఫైనల్‌లో ఆర్సీబీ విజయం సాధించిన తర్వాత ఇంటర్నెట్‌లో మీమ్స్, వీడియోలు, సెలబ్రిటీల స్పందనలతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. విరాట్ కోహ్లీ, ఆర్సీబీ విజయం గురించే అందరూ చర్చిస్తున్న తరుణాన్ని ఆసరాగా చేసుకుని, ఎలాంటి ఆధారాలు లేని ఇలాంటి స్క్రీన్‌షాట్‌లను, నిందలను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

నుస్రత్ భరుచా కెరీర్

నుస్రత్ భరుచా చివరిసారిగా విశాల్ ఫురియా దర్శకత్వంలో వచ్చిన 'ఛోరీ 2' చిత్రంలో కనిపించారు. ఈ హారర్ సీక్వెల్ చిత్రంలో ఆమెతో పాటు సోహా అలీ ఖాన్, సౌరభ్ గోయల్, గష్మీర్ మహాజని, పల్లవి అజయ్, కుల్దీప్ సరీన్, హార్దిక శర్మ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు.

విశాల్ ఫురియా, అజిత్ జగ్తాప్ సంయుక్తంగా ఈ చిత్రానికి కథను అందించారు. భూషణ్ కుమార్, విక్రమ్ మల్హోత్రా, క్రిషన్ కుమార్, జాక్ డేవిస్ లు ఈ సినిమాను నిర్మించారు. సమాజంలో ఉన్న లింగ అసమానతల నేపథ్యంలో, ఒక కుమార్తెపై తల్లికి ఉన్న అపారమైన ప్రేమను చాటిచెప్పే కథాంశంతో ఈ సీక్వెల్ రూపుదిద్దుకుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: ఆర్సీబీ గెలుపుపై నుస్రత్ భరుచా పెట్టిన ఇన్‌స్టా స్టోరీ నిజమైనదేనా?

జవాబు: లేదు. వైరల్ అవుతున్న ఆ వీడియో నుస్రత్ భరుచా అధికారిక అకౌంట్ నుంచి వచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. అది ఒక ఫేక్ లేదా ఎడిట్ చేసిన స్క్రీన్ రికార్డ్ వీడియోగా భావిస్తున్నారు.

ప్రశ్న: నుస్రత్ భరుచా నటించిన చివరి సినిమా ఏది?

జవాబు: ఆమె చివరగా విశాల్ ఫురియా దర్శకత్వంలో వచ్చిన హారర్ డ్రామా 'ఛోరీ 2' సినిమాలో నటించింది.

ప్రశ్న: ఐపీఎల్ 2026 విన్నర్ ఎవరు?

జవాబు: ఐపీఎల్ 2026 ట్రోఫీని ఆర్సీబీ దక్కించుకుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More