Ananya Birla: ఆర్సీబీ vs గుజరాత్ ఫైనల్.. అనన్య బిర్లాకు ఊహించని తిప్పలు! అసలు ఏం జరిగిందంటే?

Ananya Birla: బిజినెస్ వుమన్, మోడల్ అనన్య బిర్లాకు విచిత్రమైన పరిస్థితి వచ్చింది. ఆమె ఈ రోజు ఐపీఎల్ 2026 ఫైనల్లో ఏ జట్టుకు సపోర్ట్ చేస్తుందో అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఆర్సీబీ, జీటీ రెండు టీమ్స్ లోనూ ఆమె కంపెనీ పార్ట్ నర్ షిప్ ఉంది.

Published on: May 31, 2026, 09:34:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ananya Birla: అనన్య బిర్లాకు భలే చిక్కొచ్చి పడింది. ఐపీఎల్ 2026 ఫైనల్లో ఈ రోజు (మే 31) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ తలపడుతోంది. ఈ టైటిల్ పోరులో అనన్య బిర్లా ఏ టీమ్ కు సపోర్ట్ చేస్తుందన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. రెండు టీమ్స్ తోనూ ఆమె అసోసియేట్ కావడమే ఇందుకు కారణం.

ఐపీఎల్ ఫైనల్లో అనన్య బిర్లా సపోర్ట్ ఎవరికో?
ఐపీఎల్ ఫైనల్లో అనన్య బిర్లా సపోర్ట్ ఎవరికో?

ఆర్సీబీ ఓనర్

ఐపీఎల్ 2026లో అద్భుతమైన ప్రదర్శనతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ఫైనల్ చేరింది. అయితే ఈ సీజన్ కు ముందు ఆర్సీబీని బిర్లా గ్రూప్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆర్సీబీ ఓనర్ గా మారింది అనన్య బిర్లా. ఈ సీజన్ లో ఆర్సీబీ మ్యాచ్ లకు హాజరైన అనన్య.. స్టాండ్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

జీటీతోనూ

గుజరాత్ టైటాన్స్ తోనూ అనన్య బిర్లాకు అసోసియేషన్ ఉంది. బిర్లా ఎస్టేట్స్ కంపెనీ ఈ జీటీ జెర్సీ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో గుజరాత్ టీమ్ తో, కెప్టెన్ శుభ్ మన్ గిల్ తో కలిసి అనన్య చాలా సార్లు కనిపించింది. పర్సనల్ గా ఇన్ స్టాగ్రామ్ లోనూ గిల్ పోస్టులకు అనన్య రియాక్టవడం తెలిసిందే.

ఎవరికి సపోర్ట్?

క్రికెట్ మ్యాచ్ లో జనరల్ గా కొంతమంది ఒక టీమ్ కు, మరికొంతమంది మరో టీమ్ కు సపోర్ట్ చేస్తారు. కానీ ఐపీఎల్ 2026 ఫైనల్లో తలపడే ఆర్సీబీ, జీటీ రెండు కూడా అనన్య బిర్లాకు చెందినవే. ఈ నేపథ్యంలో అనన్య ఏ టీమ్ కు సపోర్ట్ చేస్తుందో చూడాలి. ఆర్సీబీకి ఆమె ఓనర్ కాబట్టి అదే టీమ్ కు అనన్య సపోర్ట్ చేస్తుందనే ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

రెండు టీమ్స్ జెర్సీలు రెడీగా పెట్టుకోవాలి, గెలిచిన టీమ్ జెర్సీ వేసుకోవాలని నెటిజన్లు ఫన్నీగా రియాక్టవుతున్నారు.

ఐపీఎల్ 2026 ఫైనల్

ఆదివారం ఐపీఎల్ 2026 సీజన్ అల్టిమేట్ ఫైట్ జరగనుంది. ఇందులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో మాజీ ఛాంపియన్ జీటీ తలపడుతోంది. రజత్ పాటీదార్ కెప్టెన్సీలోని ఆర్సీబీ.. శుభ్ మన్ గిల్ సారథ్యంలోని జీటీని ఢీ కొడుతోంది.

క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్ పైనే గెలిచి ఆర్సీబీ ఫైనల్ చేరింది. ఆర్సీబీ చేతిలో ఓడిన జీటీ.. ఆ తర్వాత క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ పై విక్టరీతో టైటిల్ పోరులో అడుగుపెట్టింది. ఈ ఫైనల్ రాత్రి 7.30 గంటల నుంచి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More