RCB vs GT : ఐపీఎల్​ 2026 ఫైనల్- దూకుడు వర్సెస్​ కన్సిస్టెన్సీ! గెలుపెవరిది? డిసైడింగ్​ ఫ్యాక్టర్లు..

IPL 2026 final : ఐపీఎల్​ తుది సమరానికి సర్వం సిద్ధమైంది. ఆర్సీబీ వర్సెస్​ జీటీలో గెలుపెవరిది? ఇరు జట్ల బలాలు, బలహీనతలు, డిసైడింగ్​ ఫ్యాక్టర్లను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: May 31, 2026, 07:28:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రెండు నెలల సుదీర్ఘ క్రికెట్, ఉత్కంఠభరిత లీగ్ మ్యాచ్‌లు, హోరాహోరీ ప్లేఆఫ్స్ అనంతరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 నేడు ముగియనుంది. ఈ సీజన్ విజేతను నిర్ణయించే గ్రాండ్ ఫైనల్‌కు సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), బలమైన గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు ట్రోఫీ కోసం తలపడనున్నాయి. ఇరు జట్లూ ఇప్పటికే చెరో ఐపీఎల్ కప్పును గెలిచి ఉన్నాయి. సరిగ్గా 12 నెలల క్రితం ఇదే వేదికపై తన 18 ఏళ్ల సుదీర్ఘ ఐపీఎల్ నిరీక్షణకు తెరదించుతూ తొలి ట్రోఫీని ముద్దాడిన ఆర్సీబీ.. ఇప్పుడు వరుసగా రెండొవ సారి కప్పు కొట్టి చరిత్ర సృష్టించాలని చూస్తోంది. మరోవైపు, సొంత మైదానంలో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్ రెండవ టైటిల్‌పై కన్నేసింది.

విరాట్ కోహ్లీ- శుభమాన్​ గిల్.. (PTI)
విరాట్ కోహ్లీ- శుభమాన్​ గిల్.. (PTI)

క్వాలిఫైయర్ 1 లో గుజరాత్‌ను 92 పరుగుల తేడాతో చిత్తు చేసిన ఆర్సీబీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండగా, క్వాలిఫైయర్ 2 లో రాజస్థాన్ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేజ్ చేసిన గుజరాత్ తన సత్తా చాటింది.

ఐపీఎల్​ 2026 ఆర్సీబీ వర్సెస్​ జీటీ ఫైనల్​ నేపథ్యంలో.. ఇరు జట్ల బలాబలాలు, మ్యాచ్ గమనాన్ని మార్చే కీలక అంశాల విశ్లేషణ ఇక్కడ చూద్దాము..

ఐపీఎల్​ 2026 ఫైనల్- ఆర్సీబీ అమ్ములపొదిలో అన్నీ అస్త్రాలే!

రజత్ పటిదార్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌లో అత్యంత సమతుల్యమైన జట్టుగా కనిపిస్తోంది. ఆధునిక టీ20 క్రికెట్‌కు కావాల్సిన అన్ని ప్రణాళికలతో ఆర్సీబీ బరిలోకి దిగుతోంది.

పర్ఫెక్ట్ కాంబినేషన్: ఓపెనింగ్‌లో అగ్రెషన్, మిడిల్ ఆర్డర్‌లో పటిష్టత, డెత్ ఓవర్లలో ఫినిషింగ్ పవర్.. ఇలా ఆర్సీబీ బ్యాటింగ్‌లో ఎక్కడా లోపాలు లేవు. మరీ ముఖ్యంగా క్వాలిఫైయర్ 1లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రజత్ పాటిదార్ మరోసారి జట్టును ముందుండి నడిపించాలని చూస్తున్నాడు.

బౌలింగ్ పవర్: పవర్‌ప్లేలో వికెట్లు తీయడం, డెత్ ఓవర్లలో పరుగులను నియంత్రించడంలో భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్/జాకబ్ డఫీ జోడీ తిరుగులేని ఫామ్‌లో ఉంది.

ఆర్సీబీ వర్సెస్​ జీటీ ఐపీఎల్​ 2026 ఫైనల్ వెదర్ రిపోర్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఐపీఎల్​ 2026 ఫైనల్- కన్సిస్టెన్సీకి మారుపేరు గుజరాత్..

గుజరాత్ టైటాన్స్ జట్టులో మిగతా జట్లలాగా భారీ హిట్టర్లు లేకపోవచ్చు. కానీ, వారి కన్సిస్టెన్సీనే వారికి అతిపెద్ద బలం. ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఐదేళ్లలోనే మూడవసారి ఫైనల్ చేరి జీటీ ఈ విషయాన్ని నిరూపించింది.

బౌలింగ్ విభాగానికి తిరుగులేదు: మహ్మద్ సిరాజ్, కాగిసో రబడా, రషీద్ ఖాన్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్న గుజరాత్ జట్టు ప్రత్యర్థి జట్టు చిన్న తప్పు చేసినా వదిలిపెట్టదు.

ఓపెనర్ల వీరవిహారం: శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ జోడీ ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉంది. ఈ ఇద్దరి మధ్య ఇప్పటికే 11 సెంచురూ భాగస్వామ్యాలు నమోదయ్యాయి. ఇది టీ20 చరిత్రలోనే ఒక రికార్డు. క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ ఫీల్డర్లను ప్రేక్షకులుగా మారుస్తూ వీరు ఆడిన ఇన్నింగ్స్ గుజరాత్ బ్యాటింగ్ బలానికి నిదర్శనం.

ఆర్సీబీ వర్సెస్​ జీటీ ఐపీఎల్​ 2026 ఫైనల్ పిచ్​ రిపోర్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఆర్సీబీ వర్సెస్​ జీటీ ఫైనల్ మ్యాచ్ ఎక్కడ మలుపు తిరగనుంది?

కింగ్ కోహ్లీ పాత్ర అత్యంత కీలకం: బెంగళూరు జట్టు అతిగా అగ్రెసివ్ ఆడే క్రమంలో వికెట్లు పారేసుకోకుండా ఉండాలంటే విరాట్ కోహ్లీ క్రీజులో ఎక్కువ సమయం నిలబడాలి! అయ్యర్, పడిక్కల్ వేగంగా ఆడుతున్నప్పుడు కోహ్లీ ఒక ఎండ్‌లో వికెట్ పడకుండా యాంకర్ రోల్ పోషిస్తే ఆర్సీబీ భారీ స్కోరు సాధించడం లేదా చేజింగ్ చేయడం చాలా సులువవుతుంది. కోహ్లీకి ఇలా చేయడం కొత్తేమీ కాదు! దాదాపు ప్రతి ఫైనల్​లో ఆపద్భాందవుడిలా జట్టుకు అండగా ఉంటాడు.

కొత్త బంతి వర్సెస్ జీటీ ఓపెనర్లు: గుజరాత్ టైటాన్స్ ఆశలన్నీ గిల్, సాయి సుదర్శన్ లపైనే ఉన్నాయి. ఎందుకంటే వారి మిడిల్ ఆర్డర్ కొంత బలహీనంగా ఉంది. ఒకవేళ పవర్‌ప్లేలోనే భువనేశ్వర్ కుమార్ లేదా హేజిల్‌వుడ్ ఈ ఓపెనర్లను అవుట్ చేస్తే ధర్మశాల (క్వాలిఫైయర్ 1) ఫలితమే రిపీట్ అవుతుంది. అలా కాకుండా వీరు నిలబడితే మాత్రం మిడిల్ ఓవర్లలో ఆర్సీబీ బౌలర్లపై ఒత్తిడి పెరగడం ఖాయం.

సొంత మైదానం, పిచ్‌పై పూర్తి అవగాహన ఉండటం గుజరాత్‌కు కలిసివచ్చే అంశం కాగా.. ఎలాంటి లోపాలు లేని పటిష్టమైన టీమ్ కాంబినేషన్ ఆర్సీబీ సొంతం. అహ్మదాబాద్ వేదికగా జరగబోయే ఈ అసలైన టీ20 సమరంలో ఏ జట్టు రెండొవ ట్రోఫీని దక్కించుకుంటోందో ఈ రాత్రికి తేలిపోతుంది.

ఐపీఎల్​ 2026 ఫైనల్ ఆర్సీబీ వర్సెస్​ జీటీ జట్లు (అంచనా)..

ఆర్సీబీ : విరాట్ కోహ్లీ, వెంకటేశ్​ అయ్యర్, దేవదత్ పడ్డిక్కల్, రజత్​ పటీదార్ (కెప్టెన్), జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, సుయాశ్ శర్మ, జాష్ హేజిల్​వుడ్, జాకోబ్​ డఫీ, రసిఖ్ దార్

జీటీ : శుభమాన్​ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జాస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సంధు, రాహుల్​ తేవాటియా, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, కగిసో రబాడా, అర్షద్ ఖాన్, మహమ్మద్​ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More