DC vs GT: వాట్ ఏ మ్యాచ్.. లాస్ట్ బాల్ థ్రిల్లర్.. ఒక్క రన్ తేడాతో గెలిచిన గుజరాత్ టైటాన్స్.. ఢిల్లీ హార్ట్ బ్రేక్

DC vs GT: వాట్ ఏ మ్యాచ్.. నరాలు తెగే ఉత్కంఠ. లాస్ట్ బాల్ కు రెండు రన్స్ చేస్తే చాలు ఢిల్లీ క్యాపిటల్స్ దే విజయం. కానీ ఒక్క రన్ కూడా ఇవ్వని గుజరాత్ టైటాన్స్ లాస్ట్ బాల్ థ్రిల్లర్ లో విక్టరీ ఖాతాలో వేసుకుంది. ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ అందించింది. 

Published on: Apr 09, 2026 6:06 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఐపీఎల్ 2026.. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్. ఛేజింగ్ లో లాస్ట్ ఓవర్.. ఢిల్లీ 13 రన్స్ చేస్తే గెలుస్తుంది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో ఫస్ట్ బాల్ కే నిగమ్ ఫోర్ కొట్టాడు. ఆ వెంటనే నిగమ్ ఔటైనా.. అప్పటికే జోరు మీదున్న మిల్లర్ సిక్సర్ బాదేశాడు. లాస్ట్ బాల్ కు 2 పరుగులు చేయాల్సిన పరిస్థితి. కానీ అద్భుతంగా బౌలింగ్ చేసిన ప్రసిద్ధ్ కృష్ణ ఒక్క రన్ కూడా ఇవ్వలేదు. దీంతో గుజరాత్ టైటాన్స్ సంచలన విజయాన్ని అందుకుంది.

గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్ల సంబరం
గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్ల సంబరం

వాట్ ఏ మ్యాచ్

ఐపీఎల్ 2026లో ఫ్యాన్స్ కు కావాల్సిన అసలైన మజా ఇదే కదా. ఉత్కంఠతో ఊపేసిన పోరులో బుధవారం (ఏప్రిల్ 8) రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ పై గుజరాత్ టైటాన్స్ ఒక్క రన్ తేడాతో గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 210 పరుగులు చేసింది. ఛేజింగ్ లో ఢిల్లీ 8 వికెట్లకు 209 రన్స్ చేయగలిగింది.

ఛేజింగ్ లో ఇలా

211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు కేఎల్ రాహుల్, పాతుమ్ నిశాంక అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన రాహుల్, ఈసారి క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. రబడా బౌలింగ్‌లో అతను కొట్టిన సిక్సర్ మ్యాచ్‌కే హైలైట్.

మరోవైపు నిశాంక (41) అశోక్ శర్మ వేసిన పవర్‌ప్లే చివరి ఓవర్లో ఏకంగా 23 పరుగులు పిండుకున్నాడు. వీరిద్దరూ కలిసి 76 పరుగులు జోడించాక ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో నిశాంక అవుటయ్యాడు.

మిల్లర్ అసాధారణ పోరాటం

ఢిల్లీ ఛేజింగ్ లో మిడిల్ ఓవర్లలో గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మ్యాజిక్ చేశాడు. ఒకే ఓవర్లో నితీష్ రాణా, సమీర్ రిజ్వీలను అవుట్ చేసి ఢిల్లీని దెబ్బతీశాడు. ఈ దశలో డేవిడ్ మిల్లర్ క్రీజులోకి వచ్చినప్పటికీ ఎడమచేతి గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది.

సెంచరీ దిశగా సాగిన రాహుల్ (92) అవుట్ కావడంతో ఢిల్లీ కష్టాల్లో పడింది. అయితే మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చిన మిల్లర్, సిరాజ్ వేసిన 19వ ఓవర్లో 23 పరుగులు బాది మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 13 పరుగులు కావాలి. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన స్థితిలో ఉండగా, స్ట్రైకింగ్ ఎండ్‌లో కుల్దీప్ యాదవ్ రనౌట్ అయ్యాడు.

దీంతో ఢిల్లీ 209 పరుగుల వద్ద ఆగిపోయింది. మిల్లర్ 20 బంతుల్లో 41 పరుగులు చేసి అజేయంగా నిలిచినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో ఢిల్లీ టీమ్ హార్ట్ బ్రేక్ అయింది. గుజరాత్ సంబరాల్లో మునిగిపోయింది.

చెలరేగిన బట్లర్

ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు సాధించింది. గత మ్యాచ్‌ హీరో సాయి సుదర్శన్ (12) త్వరగానే వెనుదిరిగినప్పటికీ, జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

ముఖేష్ కుమార్ వేసిన ఒకే ఓవర్లో 23 పరుగులు రాబట్టిన బట్లర్, కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గౌతమ్ గంభీర్ స్టాండ్స్‌లోకి అతను బాదిన 96 మీటర్ల సిక్సర్ హైలైట్‌గా నిలిచింది.

కెప్టెన్ ఇన్నింగ్స్

కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో బట్లర్ (52) అవుటైన తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (70), వాషింగ్టన్ సుందర్ (55) కలిసి గుజరాత్ ఇన్నింగ్స్ నడిపించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గిల్ తన శైలికి భిన్నంగా కుల్దీప్ ఓవర్లో 17 పరుగులు రాబట్టి దూకుడు ప్రదర్శించగా, సుందర్ ఐపీఎల్‌లో తన తొలి అర్ధశతకాన్ని నమోదు చేశాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More