IPL 2026 Opening Ceremony: నో గ్లామ‌ర్ షో.. ఓపెనింగ్ సెర్మ‌నీ లేకుండానే ఐపీఎల్ 2026 షురూ.. కారణం వెనుక కన్నీళ్లు

IPL 2026 Opening Ceremony: ఐపీఎల్ వచ్చిందంటేనే జోష్ వేరే లెవల్లో ఉంటుంది. ముఖ్యంగా ఓపెనింగ్, క్లోజింగ్ సెర్మనీలో గ్లామర్ షో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. కానీ ఈ సారి ఐపీఎల్ 2026 సీజన్ లో ఓపెనింగ్ సెర్మనీని నిర్వహించడం లేదు. దీనికి కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు. 

Published on: Mar 28, 2026, 13:56:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ ఐపీఎల్ కొత్త సీజన్ వస్తుందంటే హుషారు మామూలుగా ఉండదు. ఓపెనింగ్ సెర్మనీలో ఏ సెలబ్రిటీ డ్యాన్స్ చేస్తారోనని ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. కానీ ఐపీఎల్ 2026లో మాత్రం పరిస్థితి డిఫరెంట్ గా ఉండబోతుంది. ఈ సారి ఓపెనింగ్ సెర్మనీ లేకపోవడమే అందుకు కారణం.

ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీలో డ్యాన్స్ చేస్తున్న దిశా పటాని
ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీలో డ్యాన్స్ చేస్తున్న దిశా పటాని

ఐపీఎల్ 2026

ఐపీఎల్ 2026 నేడే (మార్చి 28) ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య తొలి పోరు జరగనుంది. అయితే, ప్రతి ఏటా అట్టహాసంగా జరిగే ఓపెనింగ్ సెర్మనీని ఈసారి బీసీసీఐ రద్దు చేసింది. దీని వెనుక ఒక విషాదకరమైన కారణం ఉంది.

గత ఏడాది విషాదం

2025లో ఆర్సీబీ ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ లీగ్ చరిత్రలోనే ఆర్సీబీ గెలిచిన ఫస్ట్ టైటిల్ ఇదే. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సంబరాలు నిర్వహించారు. అయితే ఆ సమయంలో చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు.

ఆత్మలకు శాంతి

ఆ 11 మంది ఫ్యాన్స్ మరణాలకు గుర్తుగా, వారికి గౌరవం ఇస్తూ ఈ ఏడాది ఎలాంటి ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించడం లేదని బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా ప్రకటించారు. మరణించిన ఆత్మలకు శాంతి కలగాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

ఆర్సీబీ నివాళి

కేవలం ఓపెనింగ్ సెర్మనీ రద్దు చేయడమే కాకుండా, ఆర్సీబీ యాజమాన్యం కూడా ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. స్టేడియంలోని 11 సీట్లను చనిపోయిన ఆ 11 మంది అభిమానుల జ్ఞాపకార్థం ఖాళీగా ఉంచనున్నారు. అలాగే, వార్మప్ సమయంలో ఆటగాళ్లు '11' నంబర్ ఉన్న జెర్సీలను ధరించడంతో పాటు, మ్యాచ్ సమయంలో నల్లటి రిబ్బన్లు (Black Armbands) కట్టుకుని నివాళి అర్పించనున్నారు.

ముగింపు వేడుకలు ఘనంగా..

ఐపీఎల్ 2026 సీజన్ కు ప్రారంభ వేడుకలు లేకపోయినా, మే 31న జరిగే ఫైనల్ మ్యాచ్ సమయంలో మాత్రం భారీ స్థాయిలో ముగింపు వేడుకలను నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. క్లోజింగ్ సెర్మనీని గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తోంది. ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ దిశా పటానీ తన హాట్ డ్యాన్స్ తో ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే.

విరాట్ కోహ్లి

ఆర్సీబీ అంటే విరాట్ కోహ్లి అనడంలో సందేహం లేదు. ఫస్ట్ నుంచి అదే ఫ్రాాంఛైజీకి కోహ్లి ఆడుతున్నాడు. ఇప్పుడు మరోసారి ఆర్సీబీ తరపున మైదానంలోకి దిగబోతున్నాడు. గత ఏడాది ఐపీఎల్ ట్రోఫీ కలను నిజం చేసుకున్న కోహ్లి.. ఈ సారి ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More