Hansika Divorce: అదంతా ఫేక్ ప్రపంచం- హన్సిక విడాకులపై మాజీ వదిన షాకింగ్ పోస్ట్- కర్మ అంటూ రాసుకొచ్చిన నటి ముస్కాన్!

Muskaan Nancy James About Hansika Motwani Divorce: వ్యాపారవేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న హీరోయిన్ హన్సిక మోత్వాని వ్యక్తిగత జీవితం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో హన్సిక మాజీ వదిన ముస్కాన్ నాన్సీ చేసిన ఇన్‌డైరెక్ట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Published on: Mar 14, 2026, 11:30:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ 'దేశముదురు' భామ హన్సిక మోత్వానీ జీవితంలో ఇప్పుడు ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. తన భర్త సోహైల్ ఖతురియా నుంచి అధికారికంగా విడాకులు తీసుకున్న వార్త మరువక ముందే హన్సిక కుటుంబ కలహాలు మళ్లీ మొదటికొచ్చాయి. హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వాని మాజీ భార్య, నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్ తాజాగా చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

అదంతా ఫేక్ ప్రపంచం- హన్సిక విడాకులపై మాజీ వదిన షాకింగ్ పోస్ట్- కర్మ అంటూ రాసుకొచ్చిన నటి ముస్కాన్!
అదంతా ఫేక్ ప్రపంచం- హన్సిక విడాకులపై మాజీ వదిన షాకింగ్ పోస్ట్- కర్మ అంటూ రాసుకొచ్చిన నటి ముస్కాన్!

"అదంతా ఫేక్.. కాలమే నిజం చెబుతుంది"

ఎవరి పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ హన్సికను ఉద్దేశించే ముస్కాన్ ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు భావిస్తున్నారు. "దయచేసి నన్ను వేరొకరి జీవిత డ్రామాల్లోకి లాగకండి. నాకు పెయిడ్ పీఆర్ (Paid PR) టీమ్స్ లేవు. ఎవరిదో 'అత్యంత నకిలీ ప్రపంచం'తో నన్ను ముడిపెట్టవద్దు. కాలమే అన్ని నిజాలను బయటపెడుతుంది.. అంతా సమయమే నిర్ణయిస్తుంది (సబ్ సమయ్ కా ఖేల్ హై). పీస్, లవ్ అండ్ కర్మ" అంటూ ముస్కాన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు.

ముదిరిన కుటుంబ కలహాలు

హన్సికకు, ఆమె వదిన ముస్కాన్‌కు మధ్య సంబంధాలు మొదటి నుంచీ అంతంత మాత్రంగానే ఉన్నాయి. గతంలో హన్సిక, ఆమె తల్లి జ్యోతి తనను వేధించారని, కట్నం కోసం ఒత్తిడి చేశారని ముస్కాన్ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.

వీరిద్దరి జోక్యం వల్లే తన కాపురం కూలిపోయిందని, మానసిక ఒత్తిడి వల్ల తనకు 'బెల్స్ పాల్సీ' (ముఖ పక్షవాతం) వచ్చిందని హన్సిక మాజీ వదిన ముస్కాన్ గతంలో ఆరోపించారు. ఈ కేసును కొట్టివేయాలని హన్సిక వేసిన పిటిషన్‌ను గత సెప్టెంబర్‌లో బాంబే హైకోర్టు తిరస్కరించడం గమనార్హం.

మూడేళ్ల ముచ్చట.. విడాకులతో ముగింపు

మరోవైపు, హన్సిక మోత్వానీ తన భర్త సోహైల్ ఖతురియా నుంచి విడాకులు పొందారు. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు పరస్పర అంగీకారంతో వీరికి విడాకులు మంజూరు చేసింది. జీవనభృతి (Alimony) గానీ, ఇతర ఆస్తులు గానీ తనకు వద్దని హన్సిక స్పష్టం చేశారు. కేవలం మనస్పర్థలు, జీవనశైలిలో తేడాల వల్లే విడిపోతున్నట్లు హన్సిక తరపు లాయర్ అద్నాన్ షేక్ తెలిపారు.

అత్యంత వైభవంగా

ఇదిలా ఉంటే, 2022 డిసెంబర్‌లో జైపూర్‌లోని మండోటా కోటలో అత్యంత వైభవంగా హన్సిక సోహైల్ ఖతురియా వివాహం జరిగింది. అంతేకాకుండా హన్సిక ఖతురాయి వివాహాన్ని అప్పట్లో ఒక రియాలిటీ షోగా కూడా ప్రసారం చేశారు.

ఈఫిల్ టవర్ ముందు లవ్ ప్రపోజ్

పారిస్‌లోని ఈఫిల్ టవర్ ముందు సోహైల్ ప్రపోజ్ చేసిన విజువల్స్ చూసి అందరూ అది ఒక 'ఫెయిరీ టేల్' అనుకున్నారు. కానీ, మూడేళ్లు తిరగకముందే ఆ బంధం ముగిసిపోవడం, అటు కుటుంబ సభ్యుల నుంచి ఇలాంటి విమర్శలు రావడం హన్సిక అభిమానులను కలవరపెడుతోంది.

ముస్కాన్ నాన్సీ జేమ్స్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ
ముస్కాన్ నాన్సీ జేమ్స్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ

జియో హాట్‌స్టార్‌ ఓటీటీలో

ఇదిలా ఉంటే, జియో హాట్‌స్టార్‌లో హన్సిక లవ్ షాది డ్రామా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More