ANGRAU UG Admissions 2026 : గుంటూరు లోని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU) నుంచి యూజీ ప్రవేశాల నోటిఫికేషన్ జారీ అయింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు అండర్ గ్రాడ్యుయేట్ (UG) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారిక ప్రవేశాల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
- ఎన్‌ఆర్ఐ (NRI) లేదా ఎన్‌ఆర్ఐ కోటా కింద భర్తీ చేసే సీట్లు : బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్, బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజనీరింగ్), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ), బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ కోర్సులలో ఎన్‌ఆర్ఐ కోటా కింద ప్రవేశాలు కల్పిస్తారు.
- బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్: ఈ కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్ ఎంపీసీ (MPC) లేదా బైపీసీ (BiPC) గ్రూపులు చదివిన వారు అర్హులు. వీరితో పాటు యాంగ్రూ (ANGRAU) నుంచి 2 లేదా 3 ఏళ్ల డిప్లొమా పూర్తి చేసిన వారు, డిప్లొమా ఇన్ వెటర్నరీ సైన్స్, డిప్లొమా ఇన్ హార్టికల్చర్, డిప్లొమా ఇన్ హోమ్ సైన్స్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET 2026) స్టేట్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు: ఎంపీసీ స్ట్రీమ్ రైతు కోటా (Farmers' Quota) కింద క్రింది కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. వీటికి ఏపీ ఈఏపీసెట్ 2026 రాష్ట్ర స్థాయి ర్యాంకును పరిగణనలోకి తీసుకుంటారు.
- బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజనీరింగ్)
- బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ)
దరఖాస్తు చేసుకునే విధానం:
అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆఫ్‌లైన్ పద్ధతిలో సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను అవసరమైన ధ్రువపత్రాలతో కలిపి పోస్ట్ ద్వారా గానీ లేదా నేరుగా అప్లికేషన్‌లో సూచించిన చిరునామాకు నిర్దేశిత గడువులోగా అందజేయాలి. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ angrau.ac.in ను మాత్రమే సంప్రదించాలి.